Begin typing your search above and press return to search.

ఊహాకు అందనట్లుగా హిల్లరీని తిట్టేసిన ట్రంప్

By:  Tupaki Desk   |   11 Oct 2016 3:43 PM GMT
ఊహాకు అందనట్లుగా హిల్లరీని తిట్టేసిన ట్రంప్
X
మన రాజకీయ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే మాటల్ని చూసి చాలామంది విపరీతమైన ఆవేదనకు గురి చేస్తుంటారు. మన రాజకీయాలు రోజురోజుకీ దిగజారి పోతున్నాయని బాధ పడుతుంటారు. ప్రపంచానికే పెద్దన్న.. ఏ విషయంలో చూసుకున్నా కంటే ఎంతో ముందుండే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో.. ఆ దేశ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో సాగుతున్న నిందా పర్వం నివ్వెర పోయేలా చేస్తుంది.

ట్రంప్.. హిల్లరీల మధ్య నడుస్తున్న విమర్శలు చూసినప్పుడు.. వారి కంటే మన నేతలే ఎంతో సభ్యతగా.. సంస్కారంగా మాట్లాడుతున్న ఫీలింగ్ కలగటం ఖాయం. గడిచిన వారం రోజుల్లో ట్రంప్ కు సంబంధించిన టేపులు కొన్ని బయటకు రావటం.. మహిళల్ని దారుణమైన రీతిలో చేసిన వ్యాఖ్యలు బయటకు వచ్చి అందరూ నివ్వెరపోయే పరిస్థితి. ఇది సరిపోదన్నట్లుగా సొంత కూతురి మీద.. ఆమె అంగసౌష్టవం మీద ట్రంప్ చేసిన వ్యాఖ్యలు విన్నప్పుడు.. అతడెలాంటి వాడోనన్న సందేహం కలగక మానదు.

ఊహించని రీతిలో తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో టేపులు బయటకు వచ్చి తన ఇమేజ్ తీవ్రస్థాయిలో డ్యామేజ్ అయిన నేపథ్యంలో.. ట్రంప్ ఎదురుదాడి మొదలెట్టారు. నిన్నటికి నిన్నజరిగిన బిగ్ డిబేట్ 2లో తాను మాటల వరకే పరిమితమని.. కానీ.. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ భర్త.. మాజీ అధ్యక్షుడైతే చేతల మనిషిగా విమర్శించారు. బిగ్ డిబేట్ 2లో హిల్లరీ కంటే వెనుకబడినట్లుగా సర్వే రిపోర్టులు వస్తున్న వేళ.. ట్రంప్ ఆవేశం హధ్దులు దాటుతోంది. తాజాగా హిల్లరీపై ఆయన ఉహకు అందని రీతిలో వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

హిల్లరీ అసలు స్వరూపం మీడియా పక్కకు తొలిగితే చాలు మొత్తంగా బయటపడుతుందన్న ట్రంప్.. మీడియా తనను బద్నాం చేస్తుందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక్కసారి మీడియా పక్కకు తప్పుకుంటే హిల్లరీ అసలు స్వరూపం బయటపడుతుందని.. మీడియా సపోర్ట్ లేకపోతే హిల్లరీకి కుక్కలు పట్టే ఉద్యోగం కూడా దొరకపోయేదని మండిపడ్డారు. ‘‘అలాంటి ఆవిడా నన్ను విమర్శించేది? అప్పుడెప్పుడో ప్రైవేట్ సంభాషణల్లో మాట్లాడిన మాటల్ని.. వీడియోలుగా చేసి ప్రదర్శిస్తున్నారు. మీడియా కూడా రెండు రోజుల పాటు వాటినే హెడ్ లైన్స్ గా వేశారు. ఇలాంటివి మానుకుంటే మంచిది. లేకుంటే హిల్లరీ కుటుంబానికి సంబంధించిన రహస్యాలు బయటపెడతా. హిల్లరీ భర్త ఒక సెక్స్ ప్రిడేటర్. అమెరికా అధ్యక్ష చరిత్రలో ఆయనంతగా ఎవరూ మహిళల్ని వేధించింది లేదు. నాపై విమర్శలు మానుకోకుంటే.. వారికి చెందిన రహస్యాలు బయటపెడతా’’ అంటూ మండిపడ్డారు. నిజంగాట్రంప్ దగ్గర హిల్లరీకి సంబంధించిన రహస్యాలు ఉండి ఉంటే.. ఇంత సేపు ఆగేవారంటారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/