Begin typing your search above and press return to search.
ట్రంప్ వీసాల వేటుకు 7 కంపెనీలకు షాక్
By: Tupaki Desk | 7 Jun 2017 5:17 AM GMTఅమెరికాలోని ఏడు భారత ఐటీ కంపెనీలకు హెచ్1బీ వీసాల్లో భారీగా కోతపడింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే, 2016లో 37 శాతం దరఖాస్తులు తగ్గాయట. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీలో కఠినతర ఆంక్షలు విధించడంతో క్రితం సారి కన్నా అధికంగా 5436 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ ఎఫ్ ఏపీ) అనే సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ లో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేసిన తర్వాత సేకరించిన అధికారిక గణాంకాలను ఈ సంస్థ ఇటీవల విడుదల చేసింది. స్థానికులకే ఉద్యోగాలు అన్న నినాదంతో స్థానికులకు అదనపు అవకాశాలు కల్పించేందుకు అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసాలను గణనీయంగా తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ప్రారంభమైన హెచ్1బీ వీసా ఆంక్షలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా తమ దరఖాస్తులను భారీగా తగ్గించుకుంటున్నాయి.
2015లో టాటాకన్సల్టెన్సీ 4,674 దరఖాస్తులు దాఖలు చేయగా - 2016లో వాటి సంఖ్యను 2,040కు తగ్గించుకుంది. అంటే 2,634 దరఖాస్తులు (56శాతం) కోతకు గురయ్యాయి. విప్రో 3,029 నుంచి 1,474 (52శాతం)కు దరఖాస్తుల్ని పరిమితం చేసింది. ఇక 2015లో 2830 దరఖాస్తులు సమర్పించిన ఇన్ఫోసిస్ 2016 ఆర్థికసంవత్సరంలో 16శాతం తగ్గించుకుని 2376 దరఖాస్తులు మాత్రమే దాఖలు చేసింది. భారత ఐటీ కంపెనీలకు హెచ్1బీ వీసాల్లో కోత 2017-18 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు తోడు క్లౌడ్ కంప్యూటింగ్ వంటి డిజిటల్ సేవలు పెరుగుతుండడం, కృత్రిమ మేధస్సు అందుబాటులోకి రావడం వంటివి కూడా వీసా దరఖాస్తులను తగ్గించుకునేందుకు కారణమవుతున్నాయి. తగ్గుతున్న కార్మికుల అవసరం - స్థానికులకే ఉద్యోగాలివ్వడం ద్వారా వీసాల భారాన్ని తగ్గించుకునేందుకు ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తున్నది అని నివేదిక విశ్లేషించింది. తయారీరంగంలోనూ హెచ్1బీ వీసాల కోత కనబడుతున్నది. 2016లో టెస్లామోటర్స్ 197 దరఖాస్తులకుగాను 108 పొందగలిగింది. ఉబర్ 121 - ఈబే 115 - మాయోక్లినిక్ 111 వీసాలను సాధించింది. ఏప్రిల్ నెలలో అమెరికాలోని మొత్తం నిరుద్యోగం 4.4శాతంగా నమోదవగా - కంప్యూటర్, గణాంకశాస్త్ర రంగంలోనే అది 2.5 శాతంగా ఉంది. నిర్మాణరంగంలో నిరుద్యోగిత 2.1శాతం కన్నా తక్కువగా నమోదైంది. అమెరికాలో 2020నాటికి అర్హులైనవారి సంఖ్య కన్నా అధికంగా 14లక్షల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఉండబోతున్నాయని కోడ్.ఆర్గ్ అనే సంస్థ అంచనా.
వీసా నిబంధనలను కఠినతరం చేయడం ఇటు నిర్వహణ వ్యయాన్ని పెంచడమే కాకుండా, అటు ప్రతిభావంతులైన ఉద్యోగులను అమెరికాకు తరలించడం కూడా కష్టతరమవుతున్నదని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. అమెరికాలో స్థానిక నియామకాలను పెంచే దిశగా అవి చర్యలు ప్రారంభించాయి. ఇన్ఫోసిస్ ఇప్పటికే రానున్న రెండేళ్లలో 10వేలమంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. స్వదేశీ రక్షణ విధానం పెరుగుతున్న సింగపూర్ - ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలోనూ వారి బిజినెస్ మోడల్స్ కు తగినట్లుగా సర్దుబాటై - వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భారత ఐటీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
2016లో ఐటీ సంస్థలు పొందిన వీసాలు..
2016-17 సంవత్సరానికిగాను హెచ్1బీ వీసాలు పొందిన ఐటీ సంస్థల్లో... కాగ్నిజెంట్ (3,949) - ఇన్ఫోసిస్ (2,376) - టీసీఎస్ (2,040) - అసెంచర్ (1,889) - ఐబీఎం (1,608) - విప్రో (1,474) - అమెజాన్ (1,416) - టెక్ మహీంద్రా (1,228) - క్యాప్ జెమిని (1,164) - మైక్రోసాఫ్ట్ (1,145) - హెచ్ సీఎల్ అమెరికా (1,041) - ఇంటెల్ (1,030) - డెలాయిట్ (985) - గూగుల్ (924) - ఎల్ అండ్ టీ (870) - ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ (713) - ఎర్నెస్ట్ అండ్ యంగ్ (649) - ఆపిల్ (631) - సింటెల్ (583) - ఫేస్ బుక్ (472) - ఒరాకిల్ (427) - సిస్కో (380) - మైండ్ ట్రీ (327) - గోల్డ్ మాన్ సాక్స్ (287) - యుఎస్ టీ గ్లోబల్ (283) - జేపీ మోర్గాన్ చేజ్ (271) - ఐ-గేట్ (255) - స్టాఫోర్డ్ (221) - యాహూ (206) - కేపీఎంజీ (198) ప్రధానమైనవి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/