Begin typing your search above and press return to search.
అరె.. ట్రంప్ నోటా చంద్రుళ్ల మాదిరే మాటలు
By: Tupaki Desk | 3 Aug 2016 5:03 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్యన చాలానే పోలికలు ఉన్నాయి. ఇద్దరికి కొత్తంటే ఒకలాంటి మోజు. ఇద్దరూ కొత్త కొత్త కలలకు అమితంగా ప్రాధాన్యం ఇస్తుంటారు. మరిన్ని స్వప్నాలు కనే చంద్రుళ్లు పాత వాటిని జాగ్రత్తగా చూస్తారా అంటే అలాంటిదేదీ కనిపించదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ఇదే తరహాలోనే వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పరాటీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్. తాజాగా ఈ బిలియనీర్ నోటి నుంచి వచ్చిన మాటలు విన్న వెంటనే.. మన ‘చంద్రుళ్లు’ చప్పున గుర్తుకు రావటం ఖాయం. ఇంతకీ ట్రంప్ నోట వచ్చిన ఆ మాటేమిటంటారా?
అమెరికాలాంటి అగ్రరాజ్యంలో అన్ని ఉన్నాయని అనుకుంటాం. కానీ.. అలాంటిదేమీ లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు ట్రంప్. ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికాకు అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్ హౌస్ లో వసతుల లేమి గురించి మాట్లాడటమే కాదు.. తాను కానీ అమెరికా అధ్యక్షుడ్ని అయితే వైట్ హౌస్ లో భారీ పార్టీలు చేసుకోవటానికి వీలుగా పే..ద్ద బాల్ రూం ఒకటి కట్టిస్తానని చెబుతున్నారు. తాను కానీ.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో విజయం సాదిస్తే వంద మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి బాల్ రూం కట్టిస్తానని చెబుతున్నారు.
తాను కటించే బాల్ రూంలో వెయ్యి మందికి ఒకేసారి స్టేట్ డిన్నర్.. పార్టీలు ఇవ్వగలిగే బాల్ రూం నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వైట్ హౌస్ లో ఈ తరహా పార్టీలకు అవకాశం లేదని.. తాను నిర్మించే బాల్ రూం కోసం అమెరికాలోనే అత్యుత్తమ టాప్ ఫైవ్ ఆర్కిటెక్ట్ లను తీసుకొని.. వారి చేత అత్యద్భుతమైన ప్లాన్ వేయించి ఈ రూంను కట్టిస్తానని చెబుతున్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ నోట నుంచివచ్చిన మాటలు విన్నంతనే మన చంద్రుళ్లు చెప్పే చాలామాటలు చప్పున గుర్తుకు రాక మానదు.