Begin typing your search above and press return to search.

ట్రంప్‌ ను క‌డిగేసిన 350 అమెరికా మీడియా సంస్థ‌లు

By:  Tupaki Desk   |   17 Aug 2018 5:51 AM GMT
ట్రంప్‌ ను క‌డిగేసిన 350 అమెరికా మీడియా సంస్థ‌లు
X
వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అమెరికా మీడియా సంస్థ‌లు మూకుమ్మ‌డిగా ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై తీవ్ర‌మైన అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ.. సంపాద‌కీయాలు రాశారు.

అమెరికా చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేని రీతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారింది. 2016లో అమెరికా అధ్య‌క్షుడైన నాటి నుంచి మీడియాను ల‌క్ష్యంగా చేసుకొన్న‌ ట్రంప్ పై అమెరికాకు చెందిన ప‌లు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నాయి. ఆయ‌న తీరు ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాద‌క‌ర‌మంటూ మండిప‌డుతున్నాయి.

త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తూ.. త‌న త‌ప్పుల్ని ఎత్తి చూపే మీడియా సంస్థ‌ల‌పై క‌త్తి క‌ట్టే ట్రంప్‌..ఇటీవ‌ల ఒక తీవ్ర నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. గ‌తంలో త‌న‌ను ఇబ్బందిక‌ర ప్ర‌శ్న‌ను అడిగిన సీఎన్ ఎన్ చాన‌ల్ రిపోర్ట‌ర్ ను ఇటీవ‌ల జ‌రిగిన మీడియా స‌మావేశానికి హాజ‌రు కాకుండా బ్యాన్ విధించారు.

దీంతో.. ఈ విప‌రీత చ‌ర్య‌పై అమెరికా మీడియా సంస్థ‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశాయి. ఏకంగా 350 మీడియా సంస్థ‌లు ట్రంప్ తీరును నిర‌సిస్తూ ఎడిటోరియ‌ల్స్ రాశాయి. ఇలాంటి వైనం అమెరికా చ‌రిత్ర‌లో గ‌తంలో ఎప్పుడూ చోటు చేసుకోలేద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. ట్రంప్ చ‌ర్య‌ను నిర‌సిస్తూ.. ఆయ‌న త‌ప్పును ఎత్తి చూపుతూ ఎడిటోరియ‌ల్స్ రాయాల‌ని బోస్ట‌న్ గ్లోబ్ ప‌త్రిక పిలుపునిచ్చింది. త‌మ‌కు న‌చ్చ‌న‌ట్లు రాసే ప‌త్రిక‌ల మీద వేధింపులు.. ఆంక్ష‌లు విధిస్తున్న ట్రంప్ తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా 350 మీడియా సంస్థ‌లు వ్య‌తిరేకంగా సంపాద‌కీయాలు ప్ర‌చురించాయి. ఈ వ్య‌వ‌హారం అమెరికాలోఇప్పుడు తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. ప‌త్రికా స్వేచ్చ ఎక్కువ‌గా ఉండే అగ్ర‌రాజ్యంలోనూ ట్రంప్ పుణ్య‌మా అని కొత్త త‌ర‌హా షాకులు అక్క‌డి మీడియా సంస్థ‌ల‌కు ఎదుర‌వుతున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.