Begin typing your search above and press return to search.

అమెరికాను దోచేస్తారా.? ట్రంప్ ఫైర్

By:  Tupaki Desk   |   11 Jun 2019 10:34 AM GMT
అమెరికాను దోచేస్తారా.? ట్రంప్ ఫైర్
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాను ప్రతి ఒక్కరు దోచుకోవడానికి చూస్తున్నారని.. తాము బ్యాంకులం కాదంటూ ఇతర దేశాల వారిపై ఫైర్ అయ్యారు. గద్దెనెక్కినప్పటి నుంచి అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా వెళుతున్న ట్రంప్ చైనా, భారత్ సహా ఇతర దేశాల వారికి అమెరికాలో అవకాశం లేకుండా వ్యాపారం చేసుకోనీయకుండా కఠిన చట్టాలు చేస్తూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అయితే తాజాగా చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగారు. అమెరికా దిగుమతి వస్తువులపై 100 నుంచి 50 శాతానికి సుంకం తగ్గించడంపై ట్రంప్ విభేదించారు. తన హయాంలో అమెరికాను మోసపోకుండా చూసుకుంటానని మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

భారత ప్రధాని నరేంద్రమోడీ తనకు క్లోజ్ ఫ్రెండ్ అయినా తమ దేశ ఉత్పత్తి అయిన హర్లే డెవిడ్ సన్ వాహనాలపై100శాతం పన్ను విధించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని.. భారత్ సుంకాలను సున్నాకు తగ్గించాలని డిమాండ్ చేశారు. మేము మాత్రం భారత్ వస్తువులపై ఎలాంటి పన్నులు వేయడం లేదని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికాను అందరూ బ్యాంకుగా చూసి దోచుకోవడానికి చూస్తున్నారని.. దీన్ని తాను చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. అమెరికా వాణిజ్య లోటు 800 బిలియన్ డాలర్లకు చేరిందని.. అమెరికా నుంచి లబ్ధి పొందాలనే ఇంకా అందరూ చూస్తున్నారని ట్రంప్ విమర్శించారు.