Begin typing your search above and press return to search.

ట్రంప్ మాట‌లు భార‌త్‌ కు వార్నింగా?

By:  Tupaki Desk   |   12 Oct 2018 4:44 AM GMT
ట్రంప్ మాట‌లు భార‌త్‌ కు వార్నింగా?
X
ఎవ‌రైనా స‌రే.. ప్ర‌పంచ పెద్ద‌న్న కోరుకున్న‌ట్లే చేయాలి. వారు గీసిన గీత దాటొద్దు. వారి వ్యాపార ప్ర‌యోజ‌నాల్ని కాపాడుతూ వంగి.. వంగి స‌లాంలు చేస్తున్నంత కాలం మిత్రులుగా ఉండ‌టం.. ఏ మాత్రం తేడా వ‌చ్చినా విరుచుకుప‌డ‌టం అమెరికా స‌హ‌జ ల‌క్ష‌ణం. ఆ తీరును మ‌రోసారి ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేస్తోంది అమెరికా.

ర‌ష్యాతో ఇటీవ‌ల చేసుకున్న ఎస్ -400 వైమానిక ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ కొనుగోలు ఒప్పందం త‌ర్వాత నుంచి పెద్ద‌న్న బార‌త్ మీద గుర్రుగా ఉంది.

ఆ విష‌యాన్ని తాజాగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ త‌న మాట‌ల‌తో చెప్ప‌క‌నే చెప్పారు. ర‌ష్యాతో డీల్ నేప‌థ్యంలో భార‌త్ పై ఆంక్ష‌ల్ని విధించ‌బోతున్నారా? అంటూ ప్ర‌శ్నించ‌గా ట్రంప్ న‌ర్మ‌గ‌ర్భంగా బ‌దులిచ్చారు. ఆంక్ష‌ల ద్వారా అమెరికా శ‌త్రువుల‌ను ఎదుర్కొనే క్యాట్సా చ‌ట్టంతో ఇప్ప‌టికే ఇరాన్.. ఉత్త‌ర కొరియా.. ర‌ష్యాల‌పై నిషేధం విధించింది.

ర‌ష్యా ఒప్పందం నేప‌థ్యంలో భార‌త్ పైన ఆంక్ష‌లు ఉంటాయా? అన్న మీడియా ప్ర‌శ్న‌కు ఆయ‌న ప‌రోక్షంగా స‌మాధాన‌మిచ్చారు.

అవేంటో భార‌త్ తెలుసుకుంటుంది. మీరు అనుకున్నంత స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు.. ఆ దేశానికి త్వ‌ర‌లోనే తెలిసి వ‌స్తుంది. మీరే చూస్తారుగా అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ట్రంప్ కు భ‌య‌ప‌డేది లేద‌ని.. ర‌ష్యాతో భార‌త్ మ‌రిన్ని ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లకు సంబంధించిన డీల్స్ చేసుకుంటుంద‌ని మోడీ స‌ర్కారు చెబుతోంది. మొత్తానికి ట్రంప్ ను కెలికిన మోడీ ప్ర‌భుత్వంపై ట్రంప్ ఏం చేయ‌నున్నారు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారిందని చెప్ప‌క త‌ప్ప‌దు.