Begin typing your search above and press return to search.

యుద్ధమేఘాలు.. ఇరాన్ కు అమెరికా హెచ్చరిక

By:  Tupaki Desk   |   5 Jan 2020 6:46 AM GMT
యుద్ధమేఘాలు.. ఇరాన్ కు అమెరికా హెచ్చరిక
X
ఇరాన్ సైనిక చీఫ్ ను అమెరికా చంపడంతో ఇరాక్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాక్ లో పర్యటన సమయంలో అమెరికా చేసిన ఈ దుస్సాహసంపై ఇరాన్ రగిలిపోతోతోంది. సైన్యాధికారి మరణానికి ప్రతీకారంగా ఇరాక్ లో క్షిపణులతో దాడులు చేస్తోంది. మరోవైపు అమెరికా కూడా ఇరాన్ సానుభూతిపరులు లక్ష్యంగా ముందుకెళ్తోంది.

తాజాగా బాగ్దాద్ గ్రీన్ జోన్ పరిధిలో క్షిపణులతో దాడి చేసింది ఇరాన్. అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసింది. అమెరికా సైన్యం లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ నేపథ్యంలోనే అమెరికా సైన్యం ఇరాక్ రాజధాని బాగ్దాద్ ను ఆధీనంలోకి తీసుకుంది. బాగ్దాద్ నుంచి ఇరాక్ సైన్యాన్ని అమెరికా తప్పించింది. మరో 10వేల మంది సైన్యాన్ని అమెరికా తాజాగా ఇరాక్ పంపింది. ఇరాక్-ఇజ్రాయిల్ సరిహద్దుల్లో భారీగా సైన్యం మోహరించింది.

తాజాగా ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ లొంగకపోతే మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే తీవ్ర దాడులకు దిగుతామన్నారు. శత్రువులను వదలమని.. వేటాడి మరీ చంపుతామన్నారు. మొత్తం 52 ప్రాంతాలను టార్గెట్ చేశామని ఇరాన్ కు హెచ్చరికలు పంపారు.