Begin typing your search above and press return to search.
ట్రంప్ భయపడ్డారా...భయపెట్టారా?
By: Tupaki Desk | 13 May 2017 4:47 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయం కారణంగా మరో వివాదంలో చిక్కుకుపోయారు. ఎఫ్ బీఐ డైరెక్టర్ పదవి నుంచి జేమ్స్ కోమేను ట్రంప్ తొలగించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఎన్నికల ప్రచార బృందం రష్యాతో కుమ్మక్కయిందా? అన్న విషయంపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో తనపై విచారణ చేయరాదు...అంటూ ఎఫ్ బీఐ డైరెక్టర్ పై ఒత్తిడి తీసుకొచ్చారని, బెదిరించారని అమెరికా మీడియా రాసిన పలు కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎఫ్‌బీఐ దర్యాప్తు వేగంగా జరుగుతున్న సమయంలో ట్రంప్ కీలకమైన నిర్ణయం తీసుకోవటం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని డెమొక్రటిక్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది.
అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన బాగోతం గురించి విశ్లేషించడం ద్వారా జేమ్స్ కోమే తన కొంపముంచుతాడని బెదిరిపోయిన ట్రంప్ ఎఫ్ బీఐ డైరెక్టర్ ను పదవి నుంచి తొలగించారని డెమొక్రట్లు ఆరోపిస్తున్నారు. మన మధ్య జరిగిన సంభాషణల టేపులు బయటకు వచ్చాయో... నీ సంగతి చూస్తానంటూ జేమ్స్ కోమేను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారని కూడా డెమెక్రాట్లు వెల్లడించడం గమనార్హం. ఒక విందు కార్యక్రమంలో, మరోసారి ఫోన్ సంభాషణల్లో జేమ్స్ కోమేతో తాను మాట్లాడానని, ఇందుకు సంబంధించి సంభాషణలు మీడియాకు లీక్ చేస్తే బాగోదంటూ తాజాగా ట్విట్టర్ లో ట్రంప్ హెచ్చరించారు.
ఈ ఏడాది మార్చి 20న సెనెట్ హౌస్ ఇంటెలిజన్స్ కమిటీ ముందు హాజరైన కోమీ, ''రష్యా జోక్యంపైనేగాక, ట్రంప్ ప్రచార బృందం రష్యాతో కుమ్మక్కయిందా? అనే విషయంపై కూడా ఎఫ్ బీఐ దర్యాప్తు జరుపుతోంది''అని చెప్పారు. అటు తర్వాత కోమీ వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలు ట్రంప్ ను ఆందోళనకు గురిచేశాయి. దీంతో సందర్భం చూసి దెబ్బకొట్టాలని ట్రంప్ ప్రణాళిక వేశారు. తనపై దర్యాప్తు చేయటం లేదని కోమీతోనే బలవంతంగా చెప్పించారు. కొద్ది రోజులాగి ఆయనకు ఉద్వాసన పలుకుతున్నామన్న వార్తను వెలువరించారు. మొన్నటిదాకా ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా జేమ్స్ కోమీ రోజూవారీగా నివేదికలు అందుకుంటున్నారు. అంతకు ముందు వీక్లీ రిపోర్టులు ఆయనకు వచ్చేవి. ఈ పరిస్థితులు ట్రంప్ ను ఆందోళనకు గురిచేశాయి. విచారణ పూర్తయితే ఎదురయ్యే పరిణామలు ఆయన్ని భయపెట్టి ఉంటాయని, వీలైనంత వేగంగా దర్యాప్తును నీరుగార్చాలని బలంగా నిర్ణయించుకున్నారని అమెరికా మీడియా పలు కథనాలు రాసింది. ఈ కథనాలను సహజంగానే ట్రంప్ ఖండించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/