Begin typing your search above and press return to search.
ట్రంప్‌లోని 'ఆ' కళలు బయటకు వచ్చాయి
By: Tupaki Desk | 6 Oct 2016 4:28 PM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ అంటేనే విమర్శలకు పెట్టింది పేరు. అయితే ట్రంప్ అంటే కేవలం నోటిదురుసు ఉన్న మనిషే కాదు మాంచి రసిక పురుషుడు కూడా అని తేలిపోయింది. ఒకనాడు పురుషపుంగవులను ఉర్రూతలూగించిన ఫేమస్ మ్యాగ్జిన్ ప్లేబాయ్ కోసం ట్రంప్ ఫోటోలు - వీడియోలు తీశారట. ప్రస్తుత ఎన్నికల పుణ్యమా అని అవి బయటకు వచ్చి హల్ చల్ చేస్తున్నాయి.
ప్లేబాయ్ పత్రిక కోసం కొందరు మోడల్స్‌ను ట్రంప్ షూట్ చేశారు. అంతేకాదు మోడల్స్‌ను ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇప్పుడా ఫోటోలు అమెరికాలో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. రసికరాజు ట్రంప్ అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి. పోలరాయిడ్ కెమెరాలతో మోడల్స్ ను షూట్ చేస్తున్న వీడియోలు అక్కడ ప్రజల్ని థ్రిల్ చేస్తున్నాయి. 1994లో ప్లేబాయ్ మ్యాగ్జిన్ కోసం ట్రంప్ ఓ మోడల్ ను ఇంటర్వ్యూ చేశారు. " ప్లేబాయ్ ఫోటోకు కావల్సినవన్నీ ఆమె దగ్గర ఉన్నాయి" అంటూ ట్రంప్ కామెంట్ కూడా చేశారట. 1990లో ప్లేబాయ్ మ్యాగ్జిన్ కవర్ పేజీ మీద కూడా ట్రంప్ కనిపించారు. 2000 సంవత్సరంలోనూ మరో ప్లేబాయ్ వీడియోలో ట్రంప్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ వీడియోలో అతను పూర్తి దుస్తులతోనే ఉన్నా - మోడల్స్ మాత్రం వివిధ భంగిమల్లో హాట్ హాట్ గా కనిపిస్తున్నారు.
మాజీ మిస్ యూనివర్స్ అలిసియాను కించపరుస్తూ ట్రంప్ కొన్నేళ్ల క్రితం కామెంట్స్ చేశారు. అయితే ఇటీవల అధ్యక్ష అభ్యర్థుల చర్చ సందర్భంగా ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను హిల్లరీ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్లేబాయ్ వీడియోలు బయటకు రావడం అక్కడ చర్చాంశమైంది. ఆడవాళ్లను ట్రంప్ కించపరుస్తున్న తీరును హిల్లరీ తప్పుపట్టిన విషయం తెలిసిందే. కానీ ట్రంప్ ఇలా ప్లేబాయ్ మ్యాగ్జిన్ మోడల్స్ తో ఫోటోలు దిగిన ఆధారాలు ఇప్పుడు ఆ పార్టీకి అధ్యక్ష ఎన్నికల్లో మైనస్ గా మారే అవకాశాలున్నాయి.రిపబ్లికన్ అభ్యర్థిని ఇరుకునపెట్టేందుకు డెమోక్రటిక్ పార్టీ పాత ఫోటోలను రచ్చకీడుస్తోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.