Begin typing your search above and press return to search.

ట్రంప్ ఒక్క రాత్రికి ఉండే గది ధర ఎంతో తెలుసా...

By:  Tupaki Desk   |   24 Feb 2020 9:00 AM GMT
ట్రంప్ ఒక్క రాత్రికి ఉండే గది ధర ఎంతో తెలుసా...
X
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ప్రస్తుతం కొనసాగుతుంది. ఉదయం అహ్మదాబాద్ కి చేరుకున్న ట్రంప్ కి ప్రధాని మోడీ స్వాగతం పలికి - ఆ తరువాత అక్కడినుండి 23కిలోమీటర్ల దూరంలో ఉన్న సబర్మతీ ఆశ్రమంకి వెళ్లారు. అక్కడ కాసేపు ఆశ్రమాన్ని పరిశీలించిన ట్రంప్ - మోడీ. అక్కడినుండి బయల్దేరి నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిశాక నేరుగా ఆగ్రాకు వెళ్లి తాజ్‌ మహల్‌ ను సందర్శిస్తారు. అక్కడి నుంచి ట్రంప్ దంపతులు ఢిల్లీకి వెళతారు. రాత్రి ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌ లో బస చేయనున్నారు.

అసలు ఢిల్లీలోని ఈ ఐటీసీ మౌర్య హోటల్‌ కి ఉన్న ప్రత్యేకతలు ఏంటి అంటే ... భారత్ పర్యటనకి వచ్చిన పలువురు ప్రపంచదేశాధినేతలు ఇదే హోటల్ లో బసచేశారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌ లో ఈ హోటల్ ఉంది. ఇక ట్రంప్ దంపతులు ఈ రోజు ఇక్కడే బసచేస్తుండటంతో హోటల్ పరిసరప్రాంతాలలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇకపోతే , ఈ హోటల్ లో ట్రంప్ బస చేయబోయే రూమ్ 14వ అంతస్తులో ఉంది. దీన్ని చాణక్యా గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ అని పిలుస్తారు. ఇదొక అపార్ట్‌ మెంట్‌ ను తలపిస్తుంది. ఈ హోటల్ లో ట్రంప్ దాదాపు 24 గంటల పాటు బస చేయనుండగా - ఒక రాత్రికి రూ. 8 లక్షల అద్దె చార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది కేవలం చాణక్య గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ కు మాత్రమే..మిగిలిన రూమ్స్ కి ఇంకో లెవెల్ చార్జెస్ ఉండనున్నాయి.

ఇది కాకుండా, హోటల్ లోని 428 గదులను అమెరికా అధికారులు - ట్రంప్ సిబ్బందికి కేటాయించారు. ఇక ట్రంప్ కుమార్తె ఇవాంకా - అల్లుడు కుష్ నర్ తదితరులు - మరో సూట్ రూమ్ లో బస చేయనున్నారు. ట్రంప్ తో పాటు అమెరికా నుంచి వచ్చిన అధికారులు - మీడియా సిబ్బందికి కూడా ఇదే హోటల్ లో గదులు కేటాయించారు. ఇక ట్రంప్ సేదదీరే చాణక్య గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్ ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సిల్క్ ప్యానల్ గోడలు - వుడెన్ ఫ్లోరింగ్ - అందమైన కళాకృతులను తీర్చిదిద్దారు. ఈ గదిలో 12 మంది కలిసి కూర్చుని భోజనం చేసే సదుపాయంతో పాటు - రిసెప్షన్ ఏరియా - మినీ జిమ్ - ప్రత్యేక స్పా కూడా ఉన్నాయి. ఇక ట్రంప్ కోసం ఆయనకు ఇష్టమైన చెర్రీ వెనీలా ఐస్ క్రీమ్ - డైట్ కోక్ తదితరాలను సూట్ లో సిద్ధంగా ఉంచారు. ట్రంప్ దంపతులకు వండి వడ్డించేందుకు ప్రత్యేక చెఫ్ ను కూడా ఇప్పటికే అందుబాటులో ఉంచారు.ట్రంప్ దంపతులకి ఇష్టమైన వంటకాలు ఏమిటో తెలుసుకుని అప్పటికప్పుడు సిద్ధం చేయనున్నారు.

కాగా, ఈ చాణక్య ప్రెసిడెన్షియల్ సూట్ లో బస చేస్తున్న నాలుగో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గతంలో బిల్ క్లింటర్ - జార్జ్ డబ్ల్యూ బుష్ - బరాక్ ఒబామాలు ఇండియా పర్యటనకు వచ్చిన సమయంలో ఇక్కడే బస చేశారు.కాగా, భారత్‌ లో ట్రంప్ దంపతులు రెండు రోజుల పాటు ఉండనున్నారు.అలాగే భారత్ పర్యటన ముగించుకొని మంగళవారం రాత్రి 10 గంటలకు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికాకు పయనం కానున్నారు.