Begin typing your search above and press return to search.

కరోనా టీకాపై ట్రంప్ సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   24 April 2020 6:30 AM GMT
కరోనా టీకాపై ట్రంప్ సంచలన ప్రకటన
X
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కబళిస్తున్న కరోనా వైరస్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీపికబురును చెప్పారు. వైట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తాము కరోనా టీకాకు చాలా దగ్గరగా ఉన్నామని సంచలన ప్రకటన చేశారు.

అమెరికాలో తమకు చాలా గొప్ప - తెలివైన సైంటిస్టులు ఉన్నారని.. వారు కరోనా టీకాపై పురోగతి సాధించారని ట్రంప్ తెలిపారు. అయితే కరోనా టీకా పరీక్షకు మాత్రం చాలా దూరంగానే ఉన్నామని ట్రంప్ తెలిపారు. ఎందుకంటే టీకా పరీక్షలు, వాడుకలోకి తీసుకురావడానికి ప్రయోగాలకు కొంత సమయం పడుతుందని ట్రంప్ తెలిపారు. తాము దీన్ని త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇక ట్రంప్ తోపాటు విలేకరుల సమావేశంలో పాల్గొన్న అమెరికా ప్రభుత్వ అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ అంథోనీ ఫౌసీ మాట్లాడారు. టీకా సిద్ధం కావడానికి కనీసం 12-18 నెలల సమయం పడుతుందని తెలిపారు.

ఆ తర్వాత అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ మాట్లాడుతూ .. కరోనా వైరస్ పై పోరాటంలో అమెరికా ఎంతో పురోగతి సాధించిందని.. త్వరలోనే అధిగమిస్తామన్నారు. ప్రస్తుతం న్యూయార్క్ మెట్రో ఏరియా - న్యూజెర్సీ - కనెక్టికట్ - డెట్రాయిట్ - న్యూ ఓర్లీన్స్ సహా వైరస్ హాట్ స్పాట్ లకే పరిమితమైందన్నారు. వేసవి ఆరంభం కావడంతో వైరస్ ను అమెరికా జయించగలదని చెప్పారు. ఇప్పటికే 16 రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తి వేసి సాధారణ జన జీవనానికి అనుమతిచ్చాయని తెలిపారు. ఇప్పటికే 4.93మిలియన్ల కరోనా పరీక్షలు చేశామని.. అమెరికాను త్వరలోనే మళ్లీ పూర్వ వైభవం దిశగా నడిపిస్తామన్నారు.