Begin typing your search above and press return to search.

మోడీ గవర్నమెంట్ బీఫ్ బ్యాన్ అన్నారు కదా... మరి ట్రంప్ కి ఎలా పెడతారు ..!

By:  Tupaki Desk   |   24 Feb 2020 5:45 AM GMT
మోడీ గవర్నమెంట్  బీఫ్ బ్యాన్ అన్నారు కదా... మరి ట్రంప్ కి ఎలా పెడతారు ..!
X
అగరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరికొద్దిసేపట్లో కుటుంబ సమేతంగా భారత్ పర్యటనకి రాబోతున్నారు. సోమవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ట్రంప్ విమానం అహ్మదాబాద్ లో ల్యాండ్ అవ్వబోతుంది అని సమాచారం. ఇక ఈ పర్యటనలో భాగంగా ట్రంప్, రెండురోజుల పాటు , మూడు నగరాలలో తన ఫ్యామిలీ తో కలిసి తిరగనున్నారు. ఇకపోతే ట్రంప్ బీఫ్ కి పెద్ద ఫ్యాన్. ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్లినా కూడా అయన ఫుడ్ మెనూలో బీఫ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సౌదీ అరేబియా లేదా సింగపూర్ వెళ్లినప్పుడల్లా ఒకవైపు కెచప్.. చిన్న సీసాల్లో స్టీక్ వంటి మెనూతో ఆయనకు ఇష్టమైన భోజనం పెట్టి సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి ఆ దేశాలు. ట్రంప్ ఇష్టంగా తినే భోజనంలో బీఫ్ లేక పోతే ఆయనకి భోజనం చేసినట్టే ఉండదు అని ఆయన్ని దగ్గరగా గమనించిన కొంతమంది చెప్తున్నారు.

ట్రంప్ డైట్‌ లో తరచుగా స్టీక్స్, బర్గర్స్, మీట్ లోఫ్ కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో భారత పర్యటనలో ట్రంప్ ఫుడ్ మెనూ ఎలా ఉండబోతుంది? అనేదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఇండియా లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ట్రంప్ కి బాగా ఇష్టమైన బీఫ్ దొరకడం కష్టమే? ఎందుకంటే.. ట్రంప్ పర్యటించే ఆగ్రా, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో హిందువులు చాలా అధికం. అలాగే ఇక్కడ ఆవులను పవిత్రంగా భావించి , పూజలు చేస్తారు. అయితే , ట్రంప్ పర్యటన రెండు రోజులు కొనసాగనున్న నేపథ్యంలో ఆయనకి విందు ఏర్పాటు చేయాల్సిందే. ఆ విందు ఏర్పాట్లలో ట్రంప్ నచ్చిన ఫుడ్ మెనూ ఉంటుందా? ఉండదా? అనేది ఇప్పుడే ఎటూ చెప్పలేని పరిస్థితి. దీనికి గల కారణం ఏమిటంటే ...ప్రధాని మోడీ శాఖాహారి. ఆయన శాఖాహార ఆహారాన్ని మాత్రమే ట్రంప్‌కు వడ్డించాలని ఆలోచిస్తున్నట్టు కొందరు అభిప్రాయ పడుతున్నారు.

గతంలో, ట్రంప్ సందర్శించిన దేశాలు సైతం, ఆయనకు నచ్చిన మెనూను సిద్ధ చేసాయి. ఒకవేళ స్టీక్ మెనులో లేకపోతే ట్రంప్ విందులో గొర్రెపిల్ల లేదా మరొక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారు. అయితే ట్రంప్ భారత పర్యటనలో మాత్రం మోడీ అమెరికా అధ్యక్షుడికి సాధారణ మెనూ ఫేర్ మాత్రమే అందిస్తున్నారని ఊహించటం కష్టమని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఫేవర్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ల లో ఒకటైన మెక్ డొనాల్డ్ నుంచి కూడా భారత్‌ లో బీఫ్ వడ్డించే పరిస్థితి లేదు. అయితే , ట్రంప్ కోసం మోడీ ఏమేమి ప్రిపేర్ చేపిస్తున్నారో ఇంకా ఎవరికీ తెలియదు. అయితే , ట్రంప్ కి బాగా ఇష్టమైన బీఫ్ ని మోడీ ఏర్పాటు చేయడం దాదాపు అసంభవం ..అయినప్పటికీ ఆయనకి తగిన రీతిలో ఆకట్టుకునేలా మెనూ ని తయారు చేసించినట్టు రాజకీయాల వర్గాల సమాచారం. ఇకపోతే ఢిల్లీలోని అధికారిక అధ్యక్ష భవనం అయిన రాష్ట్రపతి భవన్‌ లో ట్రంప్ కోసం మంగళవారం సాయంత్రం అధికారిక విందు ఏర్పాట్లు చేయనున్నారు.