Begin typing your search above and press return to search.
అమెరికాలోని తెలుగు విద్యార్థిని బతికించండి
By: Tupaki Desk | 28 Sep 2017 6:29 PM GMTఅమెరికాలో పీ.హెచ్.డి చదువుతున్న తెలుగు విద్యార్థి ఒకరు తీవ్ర ఆరోగ్యసమస్యను ఎదుర్కొంటూ చావుబతుకుల మధ్య ఉండడంతో ఆయన్ను ఆదుకోవాలంటూ నిధుల సమీకరణ జరుపుతున్నారు. ఆయన కుటుంబసభ్యులు, సోషల్ మీడియా వేదికగా పలువురు ఇతరులు పిలుపిస్తుండడంతో అందుకు నెటిజన్ల నుంచి స్పందన కనిపిస్తోంది.
ఈ నెల 15న ప్రశాంత్ కందుల అనే తెలుగు విద్యార్థి పాంటైన్ హెమరేజ్(బ్రెయిన్ స్ట్రోక్)కు గురయ్యారు. ప్రస్తుతం క్లీవ్ ల్యాండ్ మెట్రో హెల్త్ క్రిటికల్ కేర్ లో ఉన్న ఆయన మృత్యువును జయించేందుకు పోరాడుతున్నారు. తీవ్రస్థాయిలో బ్రెయిన్ స్ర్టోక్ రావడంతో కళ్లు తప్ప శరీరంలోని మిగతా అవయవాలన్నీ పరాల్సిస్ కు గురయ్యాయి.
విద్యార్థి బీమా పథకం ఉన్నప్పటికీ బ్రెయిన్ స్ర్టోక్ అందులో కవర్ కాకపోవడంతో వైద్యానికి ఆర్థిక సహాయం అందించాలంటూ ప్రశాంత్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రశాంత్ వైద్యానికి అవసరమైన 4 లక్షల డాలర్లను సమీకరించేందుకు నిధుల సమీకరణ చేపట్టారు.
తెలుగు విద్యార్థిని బతికించడానికి దాతలెవరవైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ లింకు ద్వారా సహాయం చేయొచ్చు --- https://www.gofundme.com/prasanth