Begin typing your search above and press return to search.
కేసీఆర్ నోరు తెరిచి అడిగితే.. స్పందించేది వ్యాపారులేనా?
By: Tupaki Desk | 22 Oct 2021 12:30 AM GMTయాదాద్రి పుణ్యక్షేత్రంలో బంగారు తాపడంతో చేసిన విమాన గోపురాన్ని ఏర్పాటు చేయాలన్న తలంపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రావటం తెలిసిందే. ఆయనకు ఆయనే కేజీ పదహారు తులాల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. కేసీఆర్ అంతటి పెద్ద మనిషి స్పందించి.. తన జేబులో నుంచి విరాళాన్ని ప్రకటిస్తే స్పందించకుండా ఉంటారా? ఆ వెంటనే చినజీయర్ స్వామీజీ నుంచి పలువురు పెద్ద ఎత్తున బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.
తొలిరోజున దాదాపు 24 కేజీల వరకు బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు. అందులో కేటీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉండే నేతలు.. వారికి సంబంధించిన లాబీనే ఉండటం గమనార్హం. కేసీఆర్ బ్యాచ్ తో పోలిస్తే.. కేటీఆర్ బ్యాచ్ కు చెందిన వారే బంగారం విరాళాన్ని ఇవ్వటానికి ముందుకు వచ్చిన పరిస్థితి. తొలిరోజున కేసీఆర్ నోటి నుంచి వచ్చిన కాసేపటికే 24 కేజీల బంగారం విరాళంగా వచ్చినప్పుడు రెండోరోజు ఆ ఊపు మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.
అందుకు భిన్నంగా రెండో రోజున కేవలం పదకొండు కేజీల బంగారమే విరాళంగా వచ్చింది. అది కూడా ముగ్గురు ప్రముఖులు ప్రకటిస్తే.. అందులో ముగ్గురు వాటానే 10 కేజీలు ఉండటం గమనార్హం. ఇప్పటివరకు విరాళం రూపంలో వచ్చిన బంగారంలో అత్యధికంగా విరాళం ఇచ్చిన రికార్డును ప్రఖ్యాత వ్యాపారవేత్త కమ్ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ పేరిట నమోదైంది. కంపెనీ తరఫున 6 కిలోల బంగారం విరాళంగా ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఆరు కేజీల మాట విన్నంతనే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు లక్కీ నెంబరుగా భావించే ‘ఆరు’ ఉండటం గమనార్హం.
ఇక.. ప్రణీత్ గ్రూపు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్రకుమార్ కామరాజు రెండు కేజీల బంగారాన్ని ఇవ్వనున్నట్లుగా పరకటించారు. మరో నిర్మాణ సంస్థ కేఎన్ఆర్ ఎండీ కామిడి నర్సింహారెడ్డి తమ సంస్థ తరఫున రెండు కేజీల బంగారాన్ని ప్రకటించారు. మరో ప్రముఖ వ్యాపారవేత్త ఎన్ వీ రామరాజు తన సంస్థ తరుపున కేజీ బంగారాన్నిప్రకటించారు. బుధవారం ప్రకటించిన విరాళాలు అన్ని కూడా వ్యాపార వర్గాల వారే కావటం గమనార్హం. కాబినెట్ లోని మంత్రులు కానీ.. అధికార పార్టీకి చెందిన నేతలు కానీ ఈ బంగారు విరాళాల్ని బుధవారం ప్రకటించకపోవటం గమనార్హం.
తమ ప్రియాతిప్రియమైన ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక అభిలాష వచ్చినప్పుడు.. దాన్ని పూర్తి చేసేందుకు సొంత పార్టీ నేతలు క్యూ కడతారు. అందుకు భిన్నంగా తొలిరోజుతో పోలిస్తే.. రెండోరోజున పేలవంగా బంగారువిరాళాలు రావటం గమనార్హం. ముఖ్యమంత్రి వారి డ్రీం ప్రాజెక్టుకు ఇలాంటి స్పందనా? అని ఆశ్చర్యపోతున్నారు.
యాదాద్రి దేవాలయం విమాన గోపురాన్ని తిరుమలలో మాదిరి స్వర్ణ తాపడం చేయించటం కోసం కేసీఆర్ తన మనసులోని ఆలోచనను తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. బంగారు తాపడానికి అయ్యే 125 కేజీల బంగారాన్ని సమకూర్చటం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదని.. కానీ ఈ పుణ్య కార్యంలో అందరూ పాల్గొంటే బాగుంటుందన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేయటం తెలిసిందే. ఇందులో భాగంగా ఎప్పుడూ లేనట్లుగా సీఎం కేసీఆర్ తన కుటుంబం తరఫున ఒక కేజీ పదహారు తులాల బంగారాన్ని విరాళంగా ఇస్తానని ప్రకటించటం తెలిసిందే.
తొలిరోజున బంగారం విరాళాన్ని ఇవ్వటం కోసం దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బంగారం విరాళం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆసక్తికర సూచన చేసింది. విమాన గోపురానికి బంగారాన్ని దానంగా ఇవ్వాలని భావించేవారు.. తమ దానాన్ని కేజీల లెక్కలో బంగారాన్ని ప్రకటించాలని.. బ్యాంకుఖాతాలో మాత్రం అందుకు సరిపోయే మొత్తాన్ని జమ చేయాలని కోరుతున్నారు.
బంగారాన్నివిరాళంగా ఇచ్చే వేళలో.. నాణ్యత విషయంలో హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం ఉందని.. విమాన గోపురం కోసం స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని.. అందుకే బంగారానికి బదులుగా డబ్బుల్ని బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కోరుతున్నారు. బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని భావిస్తున్న వారి కోసం ప్రత్యేకంగా ఒక ఖాతాను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా వెల్లడించారు.
ఈ కార్యక్రమంకోసం యాదాద్రి ఇండియన్ బ్యాంకులో ప్రత్యేకంగా ఒక ఖాతాను తెరిచారు. దాతలు అకౌంట్ నం. 6814884695, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఐడీఐబీ000వై011కు నగదు జమ చేయాలని దేవస్థానం ఈఓ గీతారెడ్డి వెల్లడించారు. విరాళాలు పారదర్శకంగా ఉండేందుకు బ్యాంకు ద్వారానే తీసుకోనున్నట్లు చెప్పారు. నిజమే.. అనవసరమైన తలనొప్పులకు అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారనే చెప్పాలి.