Begin typing your search above and press return to search.
సేన కన్ను స్నేహితుడి కుర్చీ మీదే పడిందా?
By: Tupaki Desk | 27 Nov 2019 10:33 AM GMTపట్టుబడితే సాధించాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తుంటాయి కొన్ని రాజకీయ పార్టీలు. అనుకున్నంతనే అన్ని జరిగిపోవు. కాలం.. ఖర్మం కలిసి రావాల్సిందే. తాజాగా సేన సుడి మామూలుగా లేదు. మొన్నటివరకూ కమలనాథులకు నమ్మకమైన మిత్రపక్షంగా వ్యవహరించిన ఆ పార్టీ ఇప్పుడు తన తీరుతో షాకులు ఇవ్వటం తెలిసిందే. 288 సీట్లున్న అసెంబ్లీలో కేవలం 56 సీట్లు ఉన్న పార్టీ అధికారాన్ని కోరుకోవటంలో అర్థముందా? అంటే.. ఇప్పటి రాజకీయంలో ఏదైనా సాధ్యమనే మాట వినిపిస్తుంటుంది.
సేన కూడా అదే నమ్మకంతో ప్రయత్నించి సక్సెస్ కావటమే కాదు.. తాను కోరుకున్న సీఎం పదవి మరో రోజులో చేతికి రానున్న వేళ.. ఊహించిన రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు సేన ఎంపీ రావత్. మహా వికాస్ అఘాడీ పేరుతో మహారాష్ట్రలో కొలువు తీరనున్న ఆ పార్టీ ఇప్పుడు తన తర్వాతి టార్గెట్ ఏమిటన్న విషయాన్ని చెప్పేసింది.
మహారాష్ట్రలో తమ లక్ష్యం నెరవేరిందని.. కేంద్రంలో బీజేపీ సర్కారుపై పోరాడటమే తమ లక్ష్యమని ప్రకటించారు రాజ్యసభ సభ్యుడు సంజయ్ రావత్. రానున్న రోజుల్లో ఢిల్లీలో చక్రం తిప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి శివసేన నుంచి వస్తారని తాను చెబితే రాజకీయ విశ్లేషకులు.. మీడియాలోని కొన్ని వర్గాల వారు తనను కామెడీ చేసిన వైనాన్ని గుర్తు చేశారు.
ఇవాళ ముంబయి మంత్రాలయ లోని ఆరో అంతస్తు (సీఎం ఆఫీస్) శివసేన సూరీడుతో వెలిగిపోతుందని.. ఫ్యూచర్ లో శివసేన సూరీడు ఢిల్లీలో అడుగు పెట్టినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. మహారాష్ట్ర మొత్తం కాకుండా కొన్ని ప్రాంతాలకే పరిమితమైన శివసేన తాజా వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నప్పటికీ.. వాస్తవానికి అంత సీన్ లేదన్నది మర్చిపోకూడదు.
తన బలాన్ని అతిగి ఊహించుకున్నట్లుగా శివసేన నేత మాటలు ఉన్నాయి. కాకుంటే.. మోడీషాల పుణ్యమా అని నమ్మకమైన మిత్రపక్షాలను దూరం చేసుకోవటం అనే యాంగిల్ లో సేన ఎంపీ మాటలు కాస్తంత అర్థవంతంగా కనిపించినా.. ఇప్పటికిప్పుడు ఈ మాటలు సరికావన్న మాట అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. భిన్నమైన విధానాల్నిఅమలు చేసే అంశం మీద ఫోకస్ పెట్టటం వదిలేసి.. అప్పుడే ఢిల్లీ పీఠాన్ని టార్గెట్ చేసే వ్యాఖ్యలు అత్యాశగా చెప్పక తప్పదు. స్పీడు ఉండాలి కానీ.. కంట్రోల్ తప్పితే కష్టమన్నది సేన నేతలు గుర్తిస్తే మంచిది.