Begin typing your search above and press return to search.

దాన్ని ఇండియా వైరస్ అని పిలవొద్దుః WHO

By:  Tupaki Desk   |   26 May 2021 5:30 PM GMT
దాన్ని ఇండియా వైరస్ అని పిలవొద్దుః WHO
X
క‌రోనా చైనా వైర‌స్ అనేది పాత ముచ్చ‌ట‌గా మారిపోయింది. ఇప్ప‌టికి అది ఎన్నో ర‌కాలుగా రూపాంత‌రం చెందిన సంగ‌తి తెలిసిందే. అందులో కొన్ని దేశాల్లో రూపం మార్చుకున్న వేరియంట్లు ప్రమాదకరంగా త‌యార‌య్యాయి. అలాంటి వేరియంట్ల‌ను ఆయా దేశాల‌కు చెందిన వైర‌స్ లు అని అర్థం వ‌చ్చేలా పిలుస్తున్నారు.

బ్రెజిల్(P.1) , సౌతాఫ్రికా (B.1.351), బ్రిట‌న్(B.1.1.7) దేశాల్లో వెలుగు చూసిన వేరియంట్ల‌ను వాటికి పెట్టిన‌ పేరుతో పిల‌వ‌కుండా.. ఆయా దేశాల పేర్ల‌తో పిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు భార‌త్ లో వెలుగు చూసిన ప్ర‌మాద‌క‌ర వేరియంట్ (B.1.617) వేరియంట్ ను కూడా భార‌త్ వైర‌స్ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి ప్ర‌పంచ దేశాలు.

ఈ వైర‌స్ ఇప్ప‌టికే 60 దేశాల‌కు విస్త‌రించిన‌ట్టు స‌మాచారం. దీంతో.. ఆయా దేశాల్లో ఇది భార‌త్ నుంచి వ‌చ్చిన వైర‌స్ అన్న‌ట్టుగా మాట్లాడుతుండ‌డంపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. B.1.617 వేరియంట్ ను భార‌త్ వేరియంట్ అని పిల‌వొద్ద‌ని స్ప‌ష్టం చేసింది. ఇత‌ర ప్ర‌మాద‌క‌ర వేరియంట్ల‌ను కూడా ఆయా దేశాల పేరుతో పిల‌వొద్ద‌ని చెప్పింది. ఆ వైర‌స్ పేరుతోనే సంబోధించాల‌ని చెప్పింది. క‌రోనా వైర‌స్ ఎంత‌గా విస్త‌రిస్తే.. అన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయ‌ని, ముందు దాన్ని అరిక‌ట్ట‌డంపై దృష్టి పెట్టాల‌ని సూచించింది.

కాగా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 16 కోట్ల మందికి వైర‌స్ వ్యాపించ‌గా.. 35 ల‌క్ష‌ల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, వైర‌స్ నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది.