Begin typing your search above and press return to search.
వద్దు...రావద్దు బాబూ.. వైసీపీ ఎమ్మెల్యేకు భారీ షాక్
By: Tupaki Desk | 15 Nov 2022 1:30 PM GMTరండి రండి దయచేయండి అంటూ రాజకీయ నాయకులను ప్రజా ప్రతినిధులను పిలిచి మర్యాద చేయడం పాతకాలం ముచ్చట. ఇపుడు జనాలలో బాగా చైతన్యం వచ్చేసింది. అలా ఇలా కాదు ఇది సోషల్ మీడియా యుగం. ఫలానా ఆసామి సంగతేంటి ఆయన ఏమి చేశారు, ఏమి చేస్తారు ఇవన్నీ జనాలకు బాగా తెలిసిపోతున్నాయి. దాంతో రాజకీయం చేయడం అంటే బాగా కష్టమే.
అందులోనూ అధికారంలో ఉన్న పార్టీకి ఎటూ చాలా ఇబ్బందులు ఉంటాయి. వారి ఎన్నో హామీలు ఇచ్చి పవర్ లోకి వస్తారు. వాటిని అన్నీ నెరవేర్చడం దేవుడికి కూడా సాధ్యం కాదు. దాంతో కచ్చితంగా జనాలలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిందే. వైసీపీ ఎమ్మెల్యేలకు ఇపుడు ప్రతీ గడపలో అదే ఇబ్బందిగా మారుతోంది. అన్నీ చేశాం మనకు తిరుగులేదని జనంలోకి వెళ్లమని అధినాయకత్వం చెబుతూ ఉంటుంది.
కానీ తీరా చూస్తే గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ వేరేగా ఉంటున్నాయి. మాకేంటి చేశారు సారూ అని ముఖం మీద అడిగేస్తున్న జనంతో నానా తంటాలు పడడం నేతల వంతు అవుతోంది. ఇపుడు అలాంటి ఒక చేదు అనుభవమే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేయార్ సుధాకరబాబుకు ఎదురైంది.
ఆయన గడపగడపకు అంటూ నాగులపాడు మండలం ఒమ్మవరంలోని ఎస్సీ కాలనీలో తాజాగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనకు జనం నుంచి నిరసన ఒక రేంజిలో ఎదురైంది. అక్కడ కాలనీ వాసులు ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకున్నారు. ఒక పెద్ద దండం పెట్టేసి మా వైపు రావద్దు. కాలనీలో అడుగుపెట్టవద్దు అంటూ నినాదాలు చేశారు.
ఓట్ల కోసం వచ్చిన తరువాత మళ్లీ ఇన్నేళ్ళ తరువాత గడప గడప పేరిట వచ్చారు. సంతోషం. కానీ మాకు ఇళ్ళ స్థలాలు రాలేదు, మాకు రోడ్లు వేయలేదు, మా సమస్యలు ఏవీ మీరు అసలు పరిష్కరించలేదు. మరెందుకు మీరు రావడం, వద్దు అంటూ మాటలతో మండిపోయేల చెప్పారు.
ఒక దశలో ఆగ్రహం ప్రదర్శించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఆధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి పోలీసులు వచ్చి కాలనీలోకి ఎమ్మెల్యే వెళ్లేలా మార్గం సుగమం చేయబోయారు. అయితే పోలీసులను కూడా కాలనీవాసులు అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ మొత్తం వివాదంలో అక్కడ ఒక మహిళ స్పృహ తప్పి పడిపోయింది కూడా.
అదే టైం లో ఒక వ్యక్తి మీద పోలీసులు దాడి చేయడంతో ఆ వైపు నుంచి జనం గుంపులో నుంచి రాళ్ళు కూడా ఈ వైపుగా పోలీసుల మీదకు వచ్చాయి. అలా ఒక పెద్ద రచ్చ సాగింది కానీ కాలనీ తలుపులు మాత్రం ఎమ్మెల్యే గారికి తెరచుకోలేదు. దీంతో ఎంత చేసినా ప్రయోజనం లేకపోవడంతో సుధాకర్ బాబు అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
ఇక ఇదే ఎమ్మెల్యే 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి బీఎస్ విజయ కుమార్ మీద దాదాపుగా తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అది జగన్ వేవ్. ఆనాడు రాజకీయ కధ వేరు. ఇపుడు మాత్రం సంతనూతలపాడు కొంప ముంచేలా ఉందని ఎమ్మెల్యే అనుచరులే గొణుక్కునే సీన్ ఉందిట. మరి ఏణ్ణర్ధంలో ఎన్నికలు ఉన్న వేళ జనాలకు ఏమి చెప్పుకుని ఎమ్మెల్యే గారు రండి రండి రండి మా కాలనీకు దయచేయండి అన్న ఘనమైన పిలుపులు అందుకుంటారో. లేక ఇలాగే రావద్దు బాబూ అనిపించుకుంటారో చూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.