Begin typing your search above and press return to search.

ఆ దేశాల వైపు వెళ్లొద్దు.. భార‌తీయుల‌కు ప్ర‌భుత్వం సూచ‌న‌

By:  Tupaki Desk   |   11 March 2020 5:30 PM GMT
ఆ దేశాల వైపు వెళ్లొద్దు.. భార‌తీయుల‌కు ప్ర‌భుత్వం సూచ‌న‌
X
ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఆవ‌రించిన క‌రోనా భ‌యాల నేప‌థ్యంలో కొన్ని దేశాల వైపు వెళ్ల‌వ‌ద్ద‌ని భార‌తీయ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం సూచిస్తూ ఉంది. ఆ దేశాల వైపు వెళ్లే ఆలోచ‌న ఏదైనా ఉంటే మానుకోవాల‌ని సూచిస్తూ ఉంది. స్ట్రిక్ట్ ఈ సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని భార‌త ప్ర‌భుత్వం ఇండియ‌న్స్ కు సూచిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న దేశాల జాబితాను పేర్కొంటూ.. ఆ కంట్రీస్ వైపు వెళ్ల‌వ‌ద్ద‌ని భార‌త ప్ర‌భుత్వం సూచిస్తూ ఉంది.

ఇంత‌కీ ఆ దేశాలు ఏవంటే..చైనా, ఇట‌లీ, ఇరాన్, సౌత్ కొరియా, జ‌పాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జ‌ర్మ‌నీ. ఈ దేశాల ప్ర‌యాణాల ఆలోచ‌న ఉంటే వాటిని ర‌ద్దు చేసుకోవాల‌ని భార‌త ప్ర‌భుత్వం సూచిస్తూ ఉంది. ఈ దేశాల్లో ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం గ‌ట్టిగా ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

చైనా నుంచినే క‌రోనా వైర‌స్ పుట్టింది. ఆ దేశంలోనికొన్ని ప్రావీన్స్ ల‌లో తీవ్ర ప్ర‌భావం చూపించింది. చైనాలో క‌రోనా వైర‌స్ కార‌క మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. ఇంకా అనేక మందికి చైనా ప్ర‌భుత్వం చికిత్స‌ను అందిస్తూ ఉంది. చైనా ఇంకా క‌రోనా ఫ్రీ అయిన వార్త‌లు రావ‌డం లేదు.

చైనా త‌ర్వాత ఇట‌లీలో క‌రోనా వైర‌స్ కార‌క మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. చైనాతో పాటు ఇట‌లీ, ఇరాన్ లలో కొన్ని వంద‌ల మంది ఈ వైర‌స్ ప్ర‌భావంతో మ‌ర‌ణించిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే జ‌పాన్, సౌత్ కొరియాల్లో కూడా క‌రోనా ప్ర‌భావాన్ని గుర్తించారు. వీటితో పాటు.. ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ, స్పెయిన్ వంటి దేశాల్లో కూడా క‌రోనా జాడ‌ల‌ను గుర్తించారు.

ఒక‌వైపు ఇండియాలో కూడా క‌రోనా ప్ర‌భావం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇండియాతో పోలిస్తే.. పై దేశాల్లో క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యం లో.. పై దేశాల ప్ర‌యాణాలు ఏవైనా ఉంటే వాటిని ర‌ద్దు చేసుకోవాల‌ని, స్ట్రిక్ట్ గా ఆ దేశాల‌కు దూరంగా ఉండే ప్ర‌య‌త్నం చేయాల‌ని భార‌త ప్ర‌భుత్వం సూచిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.