Begin typing your search above and press return to search.
వారసత్వం వద్దు.. కానీ, పార్టీలు కావాలా? మోడీకి సెగ
By: Tupaki Desk | 17 Aug 2022 6:30 AM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా.. సానుకూల పార్టీలు, ఎన్డీయే కూటమి లోని పార్టీల నుంచి కూడా సెగ భారీగానే తగులుతోంది. ఇటీవల జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పీఎం మోడీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. వారసత్వ రాజకీయ నేతలకు టికెట్లు కూడా ఇవ్వని పరిస్థితిని తీసుకురావాలని అన్నారు. అయితే.. ఆయన ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీని ఏకేసేందుకే ఇలా వ్యాఖ్యానించారనేది వాస్తవం.
కానీ, ఇప్పుడు.. ఎన్డీయే కూటమిలోని అనేక పార్టీలు.. మోడీకి మద్దతుగా నిలుస్తున్నాయి. ఆయన కూడా వాటిని వదిలించుకోవాలని భావించడం లేదు. ఎందుకైనా మంచిది.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడైనా తేడా వస్తే.. ఆయా పార్టీలు.. తమను ఆదుకుంటాయని కమల నాథులు భావిస్తున్నారు. ఇదే.. ఇప్పుడు మోడీకి అన్నివైపుల నుంచి సెగ పెంచుతోందని అంటున్నారు పరిశీలకులు. ఎలాగంటే.. మోడీకి మద్దతుగా నిలుస్తున్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా.. వారసత్వపు వేళ్ల నుంచి పుట్టుకువచ్చినవే!
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న చిన్నా చితకా పార్టీలు సహా దాదాపు 18 పార్టీలు.. నరేంద్ర మోడీ సర్కారు కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఆయన కూడా చాలా మందికి మంత్రి పదవులు ఇచ్చారు. చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ.. ఆయా పార్టీలతోనే ముందుకు సాగుతున్నారు. అయితే.. ఈ పార్టీల్లో సగానికిపైగా పార్టీలు.. వారసత్వం నుంచి వచ్చినవే. ఇప్పుడు ఈ పార్టీల్లోనే ప్రధాని మోడీ వ్యవహారంపై చర్చ జరుగుతోంది. ఉదాహరణకు.. తమిళనాడులో అన్నాడీఎంకే(బయట నుంచి మద్దతిస్తోంది) వారసత్వంగా వచ్చిన పార్టీనే.
అదేవిధంగా బిహార్‌కు చెందిన ఎల్‌జేపీ(లోక్ జనశక్తి పార్టీ) కూడా వారసత్వంగా.. కొనసాగుతున్న పార్టీనే. అలాగే.. నాగాలాండ్‌కు చెంది నాగా పీపుల్స్ పార్టీ కూడా వారసత్వంగా ఉన్న పార్టీనే. మరి ఇన్ని పార్టీల మద్దతును కోరుకుంటున్న మోడీ..
వారసత్వ రాజకీయాలు వద్దని ఎలా చెబుతారనేది ప్రధాన ప్రశ్న. వారసత్వం ఉన్నంత మాత్రాన.. ప్రజలు ఆయా నాయకులను గెలిపిస్తున్న పరిస్థితి ఎక్కడా లేదు. కర్ణాటకలో అయినా.. కేరళలో అయినా.. ఏపీలో అయినా.. ప్రజలు తాము మెచ్చిన నాయకులకే ఓటేస్తున్నారు. గెలిపిస్తున్నారు.
సో.. వారసత్వ రాజకీయాలు ఉండాలా.. వద్దా.. అనే విషయాన్ని ప్రజలే తేల్చుకుంటారనేది ప్రాంతీయ పార్టీల అభిప్రాయం. అయితే.. మోడీ వ్యాఖ్యల వెనుక.. ప్రాంతీయ పార్టీలను కూడా డిఫెన్స్‌లో పడేసే వ్యూహం ఏదో ఉందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతుండడం గమనార్హం. మరి దీనిపై ప్రాంతీయ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.