Begin typing your search above and press return to search.
కేటీఆర్ తెలియదా? వైఎస్ షర్మిలపై ట్రోలింగ్?
By: Tupaki Desk | 18 July 2021 6:31 AM GMTతెలంగాణలో రాజకీయం మొదలుపెట్టిన ఆంధ్రా ఆడకూతురు వైఎస్ షర్మిల జోరు పెంచారు. ఏకంగా తెలంగాణ సీఎం కుమారుడిని పట్టుకొని ‘కేటీఆర్ ఎవరు?’ అని షాకింగ్ కామెంట్ చేశారు. తెలంగాణలో ఏ మారుమూల అయిన దీనికి సమాధానం చెబుతారు. కానీ తెలియదన్నట్టుగా ప్రశ్నించి ఓ రకంగా అధికార పార్టీతో షర్మిల కయ్యానికి రెడీ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీతో ‘తగ్గేదిలే’ అని స్పష్టం చేశారు.
వైఎస్ షర్మిల తెలంగాణలో దూకుడైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. రాజకీయాల్లో ఎంత దూకుడు కావాలో అంత చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్షాలపై నోరుపారేసుకుంటున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై పరుష వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడిని పట్టుకొని ‘కేటీఆర్ ఎవరో తెలియదు’ అన్న షర్మిల డైలాగ్ వైరల్ అయ్యింది. ఈ వ్యాఖ్యలపై షర్మిలను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
షర్మిల పార్టీ పెట్టినప్పటి నుంచి అధికార కేసీఆర్ సర్కార్ నే టార్గెట్ చేశారు. తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ప్రతి మంగళవారం తెలంగాణ సర్కార్ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని ప్రకటించారు. చెప్పిన మాట మేరకు గత మంగళవారం దీక్ష చేసింది.
అయితే దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ‘ఏదో వ్రతం చేసినట్లుగా అప్పుడప్పుడూ వచ్చి దీక్షలు చేసే వారి వల్ల ప్రజలకు ఉపయోగం లేదని.. తెలంగాణ ప్రజల బాగోగులు చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్’ అని షర్మిలను దెప్పిపొడిచాడు.
ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలపై ఇటీవల విలేకరుల సమావేశంలో షర్మిల స్పందించింది. ‘కేటీఆర్ అంటే ఎవరు ’ అని వెటకారంగా ప్రశ్నించింది. ఆ తర్వాత కేసీఆర్ వాళ్ల అబ్బాయియే కేటీఆర్ అని చెబితే.. ‘ఓహో అవునా.. కేసీఆర్ వాళ్ల అబ్బాయి కేటీఆరా’ అంటూ షర్మిల పరువు తీసేలా వ్యంగ్యంగా స్పందించింది.
సోషల్ మీడియాలో షర్మిల వ్యాఖ్యలపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. షర్మిల గతంలో కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన పాజిటివ్ వ్యాఖ్యల వీడియోలను ఇప్పుడు నెటిజన్లు, టీఆర్ఎస్ మద్దతుదారులు బయటకు తీశారు. షర్మిలను ట్యాగ్ చేస్తూ ఆమెను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. షర్మిల గతంలో లోకేష్ ను కించపరచడానికి కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు. ఆ వీడియోను బయటకు తీసి ‘కేటీఆర్ తెలియదా? షర్మిలమ్మా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇక టీఆర్ఎస్ అధికార ప్రతినిధి అయితే టీవీ చర్చలో ఘాటుగా సమాధానమిచ్చారు. ‘ ‘షర్మిలకు వ్యతిరేకంగా నాడు తెలంగాణలో చేసిన అశ్లీల పోస్టులను తొలగించాలని ఇదే కేటీఆర్ మంత్రిగా నాడు ఆదేశించాడని.. షర్మిలకు ఈ విషయాన్ని తాము గుర్తు చేయాలనుకుంటున్నామని ’ టీఆర్ఎస్ నేత కృష్ణక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాత వీడియోల్లో షర్మిల మాట్లాడుతూ ‘తెలంగాణలో కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను మంత్రిగా చేయడం చూసి చంద్రబాబు కూడా లోకేష్ ను మంత్రిని చేశాడని.. కానీ కేటీఆర్ తెలంగాణలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తే.. లోకేష్ మాత్రం ఏమీ చేయలేకపోయాడని’ షర్మిల అన్న వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. లోకేష్ ను విమర్శించడానికి కేటీఆర్ ను వాడుకొని ఇప్పుడు తెలియదంటావా? అని షర్మిలను ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను షర్మిల సోషల్ మీడియా ఖాతాకు ట్యాగ్ చేస్తూ నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు.అప్పట్లో కేటీఆర్ ను అంతగా పొగిడిన షర్మిల ఇప్పుడు కేటీఆర్ ఎవరో తెలియదంటావా? అని ఎద్దేవా చేస్తున్నారు.
మొత్తంగా షర్మిల దూకుడుగా చేసిన ఈ పనికి అడ్డంగా బుక్కైంది. తన వ్యాఖ్యలతో ఇప్పుడు నెటిజన్లు, టీఆర్ఎస్ శ్రేణులకు టార్గెట్ గా మారింది.