Begin typing your search above and press return to search.

జర భద్రం బాబూ.. మరీ క్రికెట్​ బాల్​ కోసం ప్రాణాలకు తెగించకండి

By:  Tupaki Desk   |   19 Oct 2020 12:30 AM GMT
జర భద్రం బాబూ.. మరీ క్రికెట్​ బాల్​ కోసం ప్రాణాలకు తెగించకండి
X
శనివారం జరిగిన సీఎస్‌కే-ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ మాంచి ఆసక్తికరంగా సాగింది. చివరి ఓవర్‌ వరకూ వచ్చిన ఆ మ్యాచ్‌లో ఢిల్లీ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. ఢిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బ్యాట్‌ ఝుళిపించి ఆ జట్టుకు ఘనమైన విజయాన్ని అందించాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకున్నది. జడేజా క్రీజ్​లోకి వచ్చాక ఈ మ్యాచ్​కు పరుగుల మోత మోగించాడు. ధోనీ అవుటయ్యాక సీఎస్​కే ఫ్యాన్స్​ అంతా నిరాశలో కూరుకుపోయారు. అయితే ఆ దశలో అంబటి రాయుడు, జడేజా జట్టు పరువును కాపాడారు. జడేజా వచ్చిన తర్వాత సీఎస్‌కే ఇన్నింగ్స్‌ పరుగులు తీసింది. జడేజా కొట్టిన నాలుగు సిక్స్‌లతో సీఎస్‌కే స్కోరు బోర్డు ఈజీగా 170 పరుగుల మార్కును దాటేసింది. అయితే జడేజా కొట్టిన ఒక సిక్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

జడేజా కొట్టిన ఓ సిక్స్​ స్టేడియం దాటి రోడ్డుపైకి వెళ్లింది. ఆ బంతిని తీయడానికి ఒక అభిమాని రిస్క్‌ చేయడం కెమెరాల్లో రికార్డయ్యింది. బంతి కోసం గ్రౌండ్‌ బయట వేచి చూస్తున్న సదరు అభిమాని రోడ్డు మధ్యలోకి పరుగెత్తి దాన్ని తీయడం కామెంటేటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత అతని డేరింగ్‌ను మెచ్చుకున్నప్పటికీ వీకెండ్‌లో అలా రోడ్డు మధ్యలోకి రావడం చాలా రిస్క్‌ అని కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ అన్నారు. అసలు వీకెండ్‌లో రోడ్డుపై తనకు పరుగెత్తే అవకాశమే ఉండదంటూ అది ఎంత ప‍్రమాదకరమో అనే విషయాన్ని పరోక్షంగా చెప్పారు. బంతిని ఇంటికి తీసుకెళ్లడం కోసం ఇలా ఫ్యాన్స్‌ బయట వేచి చేయడం ఈ ఐపీఎల్‌లో చర‍్చనీయాంశమైంది.