Begin typing your search above and press return to search.
వెంకయ్య వల్ల పార్లమెంటులో తొలి రోజే గందరగోళం
By: Tupaki Desk | 15 Dec 2017 8:23 AM GMTపార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్ సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ - రాజ్యసభను చైర్మన్ - ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. లోక్ సభకు నూతనంగా ఎన్నికైన సభ్యులతో స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. నూతన మంత్రులను లోక్ సభకు ప్రధాని మోడీ పరిచయం చేశారు. ఈ సమావేశాలు 14 రోజుల పాటు జనవరి 5 వరకు కొనసాగనున్నాయి. కాగా, జేడీయూ నేతలు శరద్ యాదవ్ - అలీ అన్వర్ లను రాజ్యసభ నుంచి వెలి వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీంతో ఇవాళ రాజ్యసభలో గందరగోళం నెలకొంది. మొదటి రోజే సభలో గందరగోళం జరిగింది.
జేడీయూతో బ్రేకప్ చెప్పిన ఇద్దరు సీనియర్ నేతలపై ఆ పార్టీ ఇటీవల వేటు వేసింది. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని రాజ్యసభకు కూడా పంపించింది. దాని ఆధారంగా ఇవాళ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య ఆ ఇద్దరు సీనియర్ నేతలపై అనర్హత వేటు వేశారు. వెంకయ్య ఈ ప్రకటన చేయగానే సభలో గందరగోళం మొదలైంది. అంతకముందు ఆసియాకప్ లో అద్భుతంగా పర్ఫార్మ్ చేసిన మహిళల హాకీ టీమ్ కు వెంకయ్య కంగ్రాట్స్ చెప్పారు. మరోవైపు ఓఖీ తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని అన్నాడీఎంకే ఎంపీ నవనీతకృష్ణన్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
మరోవైపు పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్ కుమార్ స్పందిస్తూ.. ట్రిపుల్ తలాక్ - వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యంగ హోదా - రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం వంటి ముఖ్య బిల్లులు సహా ఇతర బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి సమావేశాలు ప్రారంభమైనప్పటికీ చర్చలు మాత్రం సోమవారం నుంచి జరిగే అవకాశం ఉంది. ఇటీవల మరణించిన పార్లమెంట్ సభ్యులకు నివాళులర్పించిన అనంతరం ఎలాంటి చర్చ లేకుండానే మొదటి రోజు సభను వాయిదా వేస్తారు. ఇక శని - ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో సభలో సోమవారం నుంచి చర్చ మొదలుకానుంది. అదే రోజు గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో సమావేశాలపై ఫలితాల ప్రభావం పడనుంది. సమావేశాల నిర్వహణపై స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం అఖిల పక్ష భేటీని నిర్వహించారు.