Begin typing your search above and press return to search.

మోడీని అభినందిస్తూ హెచ్చరిస్తున్నశివసేన!

By:  Tupaki Desk   |   28 Dec 2016 10:26 AM GMT
మోడీని అభినందిస్తూ హెచ్చరిస్తున్నశివసేన!
X
స్వపక్షంలో విపక్షమో లేక బీజేపీని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత తమదనే భావనో, అదీ గాక ప్రజల తరుపున పోరాటం అనే అభిప్రాయమో కానీ... ఎప్పుడు బీజేపీని ప్రశ్నించాల్సి వచ్చినా ప్రతిపక్షాలను మించి విమర్శల వర్షం కురిపిస్తూ ప్రశ్నించేది శివసేన. కొన్ని సందర్భాల్లో నేరుగా ప్రస్థావించే శివసేన - మరొ కొన్ని సందర్భాల్లో వారి అధికార పత్రిక సామ్నాతో స్పందిస్తుంది. నోట్ల రద్దు అనంతరం ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రశంసలూ, విమర్శలతో స్పందించిన శివసేన తాజాగా మరోసారి బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న బినామీలపై గురి విషయంపై శివసేన సీరియస్ గా స్పందించింది. బినామీ ఆస్తులకు చెక్ పెట్టే పేరుతో పేదలను నగ్నంగా నిలబెట్టొద్దు అంటూ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంలో మోడీని అభినందిస్తున్నట్లు అభినందిస్తూనే, చెప్పాలనుకున్న విషయం సూటిగా ఘాటుగా వారి అధికార పత్రిక సామ్నా, దో పహర్ కా సామ్నా ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు.

బినామీ ఆస్తులను వెలికి తీయాలనే ప్రధాని మోడీ ఆలోచన హర్షించదగినదే అయినప్పటికీ, ఆ సాకుతో పేదలకు మిగిలిన చడ్డీ బనియన్ ను కూడా తొలగించొద్దంటూ సూచించింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఎన్ ఆర్ ఐ, ఇతర మాఫియాలు తమ నల్లధనాన్ని వివిధ ఆస్తుల్లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టారని చెప్పిన ఉద్దవ్ థాకరే... దురదృష్టవశాత్తు సాధారణ ప్రజలు మాత్రం పడరాని పాట్లు పడ్డారని గుర్తుచేశారు. ఈ సందర్భంలో 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ చేసిన ఎన్నికల వాగ్ధానాన్ని గుర్తుచేసిన థాకరే... విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, ఒక్క పైసా తేలేదని విమర్శించారు. ఏది ఏమైనా.. నోట్ల రద్దు నిర్ణయం అనంతర పరిణామాలపై స్పందించడానికి స్వపక్షమా, విపక్షమా అన్న తేడా లేదనే అభిప్రాయం పలువురు వ్యక్తపరుస్తున్నారు!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/