Begin typing your search above and press return to search.

కరోనాపై హాట్ కామెంట్స్ చేసిన సీఎం జగన్

By:  Tupaki Desk   |   16 Jun 2021 2:46 PM GMT
కరోనాపై హాట్ కామెంట్స్ చేసిన సీఎం జగన్
X
కరోనా వైరస్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ‘స్పందన’ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సీఎం జగన్ వైరస్ గురించి కొన్ని నిజాలు చెప్పుకొచ్చారు. కోవిడ్ నియంత్రణలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని.. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందని తెలిపారు.

కేసుల సంఖ్య తగ్గుతోందని.. పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని.. కోవిడ్ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దని జగన్ పేర్కొన్నారు.కరోనాను జీవితంలో ఒక భాగం చేసుకొని ముందుకెళ్లాలని కీలక వ్యాఖ్యలు చేశారు.

మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలన్నీ కొనసాగాలని.. వాటిని మన జీవితంలో భాగం కావాలని పేర్కొన్నారు. ఫోకస్ గా టెస్టులు చేయాలని.. గ్రామాల్లో చేస్తున్న ఫీవర్ సర్వే కార్యక్రమాలు ప్రతీ వారం కొనసాగించాలని ఆదేశించారు.

టెస్టులు ఇష్టానుసారం కాకుండా ఫోకస్ గా, లక్షణాలు ఉన్న వారికి చేయాలని.. ఎవరైనా కోవిడ్ పరీక్షలు చేయమని అడిగితే వారికి కూడా చేయాలని జగన్ సూచించారు. ఆరోగ్య శ్రీ అమల్లో కలెక్టర్లను అభినందిస్తున్నానని పేర్కొన్నారు.

థర్డ్ వేవ్ వస్తుందో రాదో తెలియదని.. మనం ప్రిపేర్ గా ఉండటం ముఖ్యమని.. అదే మన చేతుల్లో ఉందని తెలిపారు. పిల్లలపై థర్డ్ వేవ్ పడకుండా చూద్దామని జగన్ సూచించారు.