Begin typing your search above and press return to search.
స్టూడెంట్ వీసాలపై ఆందోళన వద్దు.. అమెరికా ఎంబసీ కీలక ప్రకటన
By: Tupaki Desk | 18 Jun 2021 7:30 AM GMTమొన్నటి వరకు వణికించిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కేసుల తీవ్రత తగ్గటంతో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటివేళ.. కరోనాతోనూ.. లాక్ డౌన్ తోనూ ఆగిన తమ కార్యకలాపాల్ని ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. అమెరికాలో ఉన్నత విద్య కోసం ప్లాన్ చేసుకున్న ఎంతో మందికి కరోనా పరిస్థితులు టెన్షన్ పుట్టించాయి. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
అమెరికాలోని పలు వర్సిటీలు ఆడ్మిషన్లు షురూ చేయటంతో.. వీటి కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఇప్పుడు ఒక్కసారిగా వాటి మీద ఫోకస్ పెడుతున్నారు. స్టూడెంట్ వీసాల కోసం అమెరికా ఎంబసీ వెబ్ సైట్ ను సందర్శిస్తున్నారు. లాగిన్ అయి.. వీసా అపాయింట్ మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఆడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా ఒక్కసారిగా వెబ్ సైట్ లోకి లాగిన్ కావటం వల్ల సైట్ పలుమార్లు క్రాష్ అవుతోంది.
దీని కారణంగా విద్యార్థులు కొత్త సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే.. సైట్ క్రాష్ అయినప్పుడు పదే పదే లాగిన్ అవుతున్న విద్యార్థుల ఖాతాలు లాక్ అయిపోతున్నాయి. దీంతో వారిలో టెన్షన్ రెట్టింపు అవుతోంది. వెంటనే వారు అమెరికా ఎంబసీని సంప్రదిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఎంబసీ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది.
లాక్ అయిన విద్యార్థుల ఖాతాలు 72 గంటల తర్వాత ఆటోమేటిక్ గా అన్ లాక్ అవుతాయని.. ఆ విషయంలో ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. అంతేకాదు.. వీసాలకు కీలకమైన అపాయింట్ మెంట్ల విషయంలో ఆందోళన వద్దని స్పష్టం చేస్తున్నారు. జులై నుంచి మరిన్నిఅపాయింట్ మెంట్లు ఇవ్వనున్నట్లు ఎంబసీ వివరించింది. సో.. వీసా అపాయింట్ మెంట్ కాలేదని ఆందోళన చెందే వారు మరీ అంతలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఇక.. వర్సిటీల్లో ఆడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా టీకా వేయించుకోవాలని పోటీ పడుతున్నారు. ఇలాంటి వారి విషయంలోనూ ఒక కీలక సూచన చేసింది. విద్యార్థులు ఎవరైనా సరే.. వారు ఆడ్మిషన్లు పొందిన యూనివర్సిటీ వారి సూచనల్ని పాటించాలని కోరుతోంది.
ఎందుకంటే..కొన్ని వర్సిటీలు తాము సూచన చేసిన వ్యాక్సిన్లు మాత్రమే వేసుకోవాలన్న నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నాయని.. ఈ విషయంలో ఏ మాత్రం పొరపాటు చేసుకున్నా ఇబ్బంది తప్పదు కాబట్టి.. ఆడ్మిషన్ పొందిన విద్యార్థులంతా టీకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆడ్మిషన్ పొందిన వర్సిటీ సూచనల్ని మాత్రమే పాటించాలే తప్పించి.. సొంత నిర్ణయాలు ఏ మాత్రం పనికి రావని ఎంబసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.