Begin typing your search above and press return to search.

వీళ్ళ బాధేమిటో అర్ధం కావటంలేదే ?

By:  Tupaki Desk   |   6 Jun 2021 7:30 AM GMT
వీళ్ళ బాధేమిటో అర్ధం కావటంలేదే ?
X
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్ణయం సమర్ధనీయం కాదు’..తమ్మినేని

‘బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవటం ద్వారా ఈటల తప్పు చేస్తున్నారు’ కోదండరామ్

పై వ్యాఖ్యలు చూసిన తర్వాత అసలు వీళ్ళ బాధేమిటో జనాలకు అర్ధం కావటంలేదు. తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే స్వేచ్చ కూడా ఈటలకు లేదా ? అనే సందేహం వస్తోంది. బీజేపీలో చేరాలన్న ఈటల నిర్ణయాన్ని ఆక్షేపిస్తున్న నేతలకున్నా రాజకీయ పరిజ్ఞానం ఈటలకు ఎక్కువుందనే అనుకోవాలి. ఎందుకంటే ఈటల నిర్ణయాన్ని తప్పుపడుతున్న చాలామందికన్నా ఎక్కువసార్లు ఈటల ఎంఎల్ఏగా గెలిచారు.

మొదటగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విషయం తీసుకుందాం. బీజేపీది పాసిస్టు పార్టీనట. కాబట్టి ఈటల నిర్ణయం సరికాదంటున్నారు. ఫాసిస్టో, బూర్జువా పార్టీనో బీజేపీలో చేరితే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని అనుకోబట్టే అందులో చేరాలని ఈటల నిర్ణయించుకున్నారు. ఏ పార్టీలో చేరితో ఈటల రాజకీయ భవిష్యత్తు బాగుంటుందో తమ్మినేని చెబితే బాగుంటుంది.

ఇక కోదండరామ్ గురించి తీసుకుంటే ఈయన్ను రాజకీయనేతగానే జనాలు గుర్తించలేదు. అందుకనే ఇప్పటికి పోటీచేసిన ఏ ఎన్నికలో కూడా ఈయన గెలవలేదు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని లీడ్ చేయటంతోనే తెలంగాణాలో తానొక తిరుగులేని లీడర్ అనే భ్రమలో ఉన్నట్లున్నారు. అయితే రాజకీయంగా ఈయన స్ధాయి ఏమిటో జనాలు స్పష్టంగా చెప్పేశారు. పార్టీల వారీగా చూస్తే ఏ పార్టీకి కూడా కేసీయార్ ను ఢీకొట్టేంత సీన్ లేదని అందరికీ తెలిసిందే.

పార్టీ ఏదైనా ముందు ఉపఎన్నికలో హుజూరాబాద్ లో గెలవటం అన్నది ఈటల ఇజ్జత్ కా సవాలైపోయింది. నియోజకవర్గంలో ఏ పార్టీ బలంగా ఉందనే విషయం ఈటలకు తెలీకుండానే ఉంటుందా ? అలాగే వ్యక్తిగతంగా తన బలమేంటో కూడా తెలిసే ఉంటుంది. అందుకనే అన్నీ విషయాలు భేరీజు వేసుకునే బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. ఈటల నిర్ణయం తప్పా ఒప్పా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఉపఎన్నికలో ఈటల గెలిస్తే హీరో లేకపోతే జీరో అంతే.