Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేక హోదా...పొత్తుపై జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   31 Jan 2019 3:59 PM GMT
ప్ర‌త్యేక హోదా...పొత్తుపై జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
X
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌ మోహన్‌ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న లోక్‌ స‌భ‌ - అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పొత్తులు - ఏపీ భ‌విష్య‌త్ గురించి విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న చేశారు. జ‌నవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో ప్రభావం చూపగల దాదాపు 60 వేల మందికి పైగా వ్య‌క్తులు నుంచి వ్యక్తిగతంగా ఉత్తరాలు పొందారు. సమాజంలో వారు భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ రాష్ట్ర అభివృద్ధి లో పాలు పంచుకోవాల‌ని లేఖ‌లో వైఎస్ జ‌గ‌న్ కోరారు. వారి సేవ‌ల‌ను ప్ర‌శంసించారు. ఈ ఉత్తరాల ద్వారా ఆయా ప్రాంతాలు - రాష్ట్ర అభివృద్ధికి సలహాలు - సూచనలు ఇవ్వమని...తద్వారా - రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలో ఎంతగానో ఉపయోగపడుతాయని వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి కోరారు.

ఉత్తరాలు పొందిన వ్యక్తులు సూచనలు ఇవ్వడానికి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి హైద‌రాబాద్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైఎస్ జ‌గ‌న్ స‌మావేశ‌మై ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై తన విజన్‌ను కార్యక్రమంలో‌ పాల్గొన్న వారితో వైఎస్ జ‌గ‌న్ చర్చించగా...ప్రాంతాల వారిగా సమస్యలు - వాటి పరిష్కారంపై అన్ని వర్గాల వారు ‌తమ ఆలోచనలను ‌పంచుకున్నారు. సమావేశం ముగిసే ముందు - ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి - వివిధ సమస్యలతో పాటు - వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ప్రశ్నలను వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ముందుంచారు. ఎలాంటి స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేస్తున్న మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రానికి మంచి చేసే దిశగా మీ సహకారాన్ని ఆశిస్తున్నానని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ మీలాంటి వాళ్లను కలుస్తానని స్పష్టం చేశారు. ``చట్ట ప్రకారం విశాఖపట్నానికి రైల్వే జోన్‌ రావాలి. దాదాపు అన్ని రాష్ట్రాలకూ రైల్వే జోన్‌ ఉంది. దీని కోసం మా పోరాటం ఆగదు. రైల్వేజోన్‌ అంశంపైన నాకు పూర్తి అవగాహన ఉంది`` అని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. రైల్వే జోన్‌ కోసం వైఎస్సార్‌ సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా - రైల్వేజోన్‌ - కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం అలుపెరుగని కృషి చేస్తామని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. మాటలు నమ్మి ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకుంటే మోసపోతామని తెలిపారు. 25 ఎంపీ సీట్లు ప్రజలు మన పార్టీకి ఇస్తారని - కేంద్రంలో ఏపార్టీకి పూర్తి మెజార్టీ రాదని - హంగ్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ``ప్రత్యేక హోదా వస్తుంది - రైల్వేజోన్‌ కూడా వస్తుంది. ఎన్నికలకు ముందు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం. ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతనే మద్దతు ఇస్తాం` అని వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన సందర్భంగా నమోదైన కేసుల ఎత్తివేతలోనూ చంద్రబాబు పక్షపాతం చూపారని అన్నారు. అధికారంలోకి రాగానే ప్రజా ఉద్యమాలు - ఆందోళనలు - ధర్నాల కారణంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పథకాలను డోర్‌ డెలివరీ చేసేందుకు ప్రతీ 50 కుటుంబాలకు రూ. 5 వేల జీతంతో ఒకరిని నియమిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా ప్రభుత్వ పథకాలను మంజూరు చేస్తామని తెలిపారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా 45 ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో రూ. 75 వేలు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. గ్రామ సెక్రటేరియట్‌ ద్వారా పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని తెలిపారు. కియా ఫ్యాక్టరీ ఘనత చంద్రబాబు తీసుకున్నా సరే గానీ.. అందులో 5 శాతం ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన, ఏర్పాటుకానున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని తొలి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తెస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా కేలండర్‌ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.ప్రతీ గ్రామంలో 10 మంది ఉద్యోగాలు కల్పిస్తామని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.