Begin typing your search above and press return to search.
పిల్లల కోసం మోదీ కొత్త ఐడియా!
By: Tupaki Desk | 18 Jun 2017 12:20 PM GMTడోరేమాన్ - నోబితా - జియాన్ - షిన్ చాన్....ప్రస్తుతం చిన్నపిల్లల నోట వినిపించే కార్టూన్ క్యారెక్టర్ల పేర్లివి. డిస్నీ - కార్టూన్ నెట్ వర్క్ - డిస్నీ ఎక్స్ డీ వంటి కార్టూన్ చానళ్లకు పిల్లలు ఎంతగా ఆకర్షితులయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలపై ఆ క్యారెక్టర్ల ప్రభావం చాలా ఉంది. ఎంతగా అంటే... మొన్నటికి మొన్న ఓ పిల్లవాడు కార్టూన్ లను అనుకరిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. చికిత్స పొందుతూ ఆ పిల్లవాడు మరణించాడు. పాశ్చాత్య కార్టూన్ చానళ్ల ప్రభావంతోనే పిల్లలు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఈ తరహా చానళ్లకు అడ్డుకట్ట వేయడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మన దేశంలోని చిన్నారులకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు - పురాణేతిహాసాలు తెలియజేసేందుకు ప్రత్యేకంగా కిడ్స్ చానల్ ప్రారంభించాలని నిర్ణయించింది. పూర్తిగా కార్టూన్లతో కూడిన చానల్ ను అతి త్వరలో ప్రారంభించేందుకు దూరదర్శన్ సన్నాహాలు చేస్తోంది.
చిన్నారుల్లో స్ఫూర్తి నింపేలా - భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించేందుకు దూరదర్శన్ ఏర్పాట్లు చేస్తోంది. పాపులర్ కిడ్స్ చానళ్లు - తదితర విదేశీ అనువాద చానళ్లను వీక్షిస్తున్న చిన్నారులకు భారతీయ సంప్రదాయాలు తెలియజేయడమే ఈ చానల్ ఉద్దేశం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/