Begin typing your search above and press return to search.
అమెరికాలో ‘దోశె మ్యాన్’ ఫేమస్
By: Tupaki Desk | 22 Jun 2019 1:30 AM GMTఅమెరికాలోని న్యూయార్క్ సిటీలో 18 ఏళ్లుగా రెస్టారెంట్ నడిపిస్తున్న మన దక్షిణ ఆసియన్ కందస్వామి తిరుకుమార్ దోశెలంటే అమెరికన్స్ చెవికోసుకుంటాడు. ఆయన కోసం పొద్దున్న వచ్చి ఎదురుచూస్తుంటారు. వాషింగ్టన్ స్వ్వేర్ వద్ద 18 సంవత్సరాలుగా ఆ మహానగరంలోని కస్టమర్లకు నోరూరే దోశెలను అందిస్తున్నారు. వివిధ రకాల కొత్త దోశెలను సృష్టించి అందరికీ ‘దోశెమ్యాన్’గా అమెరికాలో ఫేమస్ అయ్యాడు..
కందస్వామి తిరుకుమార్ స్వస్థలం శ్రీలంక. కొన్ని దశాబ్ధాల క్రితం అమెరికాకు వలస వెళ్లాడు. అక్కడ రెస్టారెంట్లో పనివాడుగా చేరి.. భారతీయ వంటకాలను తయారు చేయడం నేర్చుకున్నాడు. అనంతరం భారతీయులు పెద్ద సంఖ్యలో ఉండడంతో చూసి దక్షిణ భారతీయ వంటకాలతో ఒక ఫుడ్ కార్ట్ ను వాషింగ్టన్ స్వ్కేర్ వద్ద ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫేమస్ ప్లెయిన్ దోశె, ఉప్మా దోశ, ఆనియన్ దోశె, బట్టర్ దోశె, ఊతప్పం, ఇడ్లీ లంచ్, జాఫ్నా లంచ్, కూరలు, సమోసా లాంటి వంటకాలతో ఫుడ్ కోర్టు ఉంది. ఇది అమెరికాలోనే బాగా ఫేమస్ అయిన ఇండియన్ ఫుడ్ కోర్ట్ గా పేరొందింది.
ఇక కొత్తగా దోశెల్లో పాండిచ్చేరి దోశెను కూడా సృష్టించి తిరుకుమార్ ఫేమస్ అయ్యాడు. ఇక న్యూయార్క్ యూనివర్సిటీ విద్యార్థులంతా ఇక్కడికే వచ్చి వంటకాలను ఆరగిస్తుంటారు. అక్కడే గంటల తరబడి ఫెస్టివెల్స్ చేసుకుంటారు. గిరాకీ బాగా ఉండే ఈయన రెస్టారెంట్ కు ఫేస్ బుక్ లోనూ ఆదరణ ఉంది. రెస్టారెంట్ గురించి పూర్తి సమాచారాన్ని తిరు కుమార్ అందులో అప్ డేట్ చేస్తుంటారు. ఇలా 18 ఏళ్లుగా అమెరికాలో ‘దోశెమ్యాన్’గా తిరుకుమార్ ఫేమస్ అయ్యాడు.