Begin typing your search above and press return to search.

సంక్రాంతికి ఏపీకో డబుల్ డెక్కర్

By:  Tupaki Desk   |   15 Dec 2015 5:15 AM GMT
సంక్రాంతికి ఏపీకో డబుల్ డెక్కర్
X
ఏపీ తాత్కలిక రాజధాని విజవాడ నుంచి.. విశాఖపట్నం మధ్య ఒక డబుల్ డెక్కర్ ట్రైన్ ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని రైల్వే శాఖ తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలుఇంకా సిద్ధం కానప్పటికీ.. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. రానున్న సంక్రాంతి నాటికి ఈ రైలు నడుస్తుందని భావిస్తున్నారు. విజయవాడ.. విశాఖపట్నం మధ్య రద్దీ భారీగా ఉండటం.. బస్సు ప్రయాణం అనుకూలంగా లేని నేపథ్యంలో.. డబుల్ డెక్కర్ ట్రైన్ ను ఏర్పాటు చేస్తే ఆధాయం బాగా వస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

అయితే.. ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ ను విశాఖ నుంచి బయలుదేరుతుందా? విజయవాడ నుంచి బయలుదేరుతుందా? అన్న విషయాలతో పాటు.. టైమింగ్స్ తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే.. విజయవాడ.. విశాఖల మధ్య నడవనున్న డబుల్ డెక్కర్ ట్రైన్ కాచిగూడ.. తిరుపతి.. కాచిగూడ.. గుంటూరు మధ్య ట్రైన్ అని చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ సర్వీసులు షురూ చేసినా.. ఆశించినంత ఆదరణ లేని నేపథ్యంలో.. ఈ సర్వీసును తొలగించి.. దీని స్థానే విజయవాడ.. విశాఖల మధ్య నడపాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో అయితే.. ఒకే రాష్ట్రం అన్నట్లు ఉండేది. తాజాగా రెండు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో.. కొత్త రైళ్ల సంగతి తర్వాత.. ఉన్న రైళ్లను ఆపేస్తామంటే.. తెలంగాణ రాష్ట్రం ఎలా రియాక్ట్ అవుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాని పక్షంలో.. సంక్రాంతికి కొత్త సర్వీసు షురూ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.