Begin typing your search above and press return to search.

అటు ప్రియాంక. ఇటు ఎఫ్ ఏటీఎఫ్.. పాక్ కు డబుల్ దెబ్బ

By:  Tupaki Desk   |   23 Aug 2019 9:52 AM GMT
అటు ప్రియాంక. ఇటు ఎఫ్ ఏటీఎఫ్.. పాక్ కు డబుల్ దెబ్బ
X
పాకిస్తాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సమర్థించింది. భారత పౌరురాలుగా ఆమె వాదన వినిపించింది. అంత వరకూ ఓకే. అయితే ప్రియాంక ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ హోదాలో ఉంది. లాస్ ఎంజెల్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిపై పాక్ మహిళ ఆయేషా అందరి ముందే ప్రియాంకను నిలదీసింది. దీనిపై ప్రియాంక కూడా గట్టిగానే బదులిచ్చింది. తన దేశం పట్ల అభిమానాన్ని వెల్లడించే హక్కు తనకు ఉందని స్పష్టం చేసింది.

అయితే తాజాగా పాకిస్తాన్ మానవ వనరులశాఖమంత్రి షిరిన్ మజిరి దీనిపై ఐక్యరాజ్యసమితికి లేఖ రాసింది. యూఎన్ గుడ్ విల్ అంబాసిడర్ అయిన ప్రియాంక పాక్ పై దాడులను సమర్థించిందని ఆమెను తొలగించాలంటూ కోరారు.

దీనికి ఐక్యరాజ్యసమితి స్పందించింది. పాక్ మంత్రికి షాక్ ఇచ్చింది. తన వ్యక్తిగత సామర్థ్యం- హక్కులపై స్పందించే హక్కు ప్రియాంకకు ఉందని స్పష్టం చేసింది. వారి వ్యక్తిగత అభిప్రాయాలు, చర్యలతో యూనిసెఫ్ కు సంబంధం లేదని తెలిపింది. దీంతో ప్రియాంకపై కక్షగట్టిన పాక్ కు చెంపపెట్టులాంటి సమాధానం యూఎన్ నుంచి ఎదురైంది.

*పాకిస్తాన్ కు మరో షాక్
ఇదే కాదు పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ కూడా తగిలింది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ తీవ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను నివారించడంలో విఫలమైన పాకిస్తాన్ కు ‘ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ ఏటీఎఫ్) భారీ షాకిచ్చింది. పాకిస్తాన్ కు నిధులు ఇచ్చేది లేదని ఏకంగా బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో ప్రపంచదేశాల ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆర్థిక పతనంతో కుదేలై అప్పుల కోసం ప్రపంచదేశాల ముందు అర్రులు చాస్తున్న పాకిస్తాన్ ఎఫ్ ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో పైసా పుట్టని పరిస్తితి నెలకొంది. అన్ని దారులు మూసుకుపోయి ఇమ్రాన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను అమ్మి సొమ్ముచేసుకునే పనిలో పడింది. ఇప్పుడు ఎఫ్ ఏటీఎఫ్ దెబ్బ కోలుకోకుండా చేస్తోంది.