Begin typing your search above and press return to search.
ఏర్పేడు ప్రమాదం వెనుక అసలు నిజాలేంటి?
By: Tupaki Desk | 21 April 2017 4:48 PM GMTచిత్తూరు జిల్లాలోని ఏర్పేడు పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, అనంతరం పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటనలో సుమారు 20 మంది దుర్మరణం చెందగా, మరో 20 మందికి పైగా గాయపడ్డ ఘటనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్థానికంగా నెలకొన్న సమస్యలపై ప్రజలు ఆందోళనలు చేయడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఏర్పేడు మండలం వరదలపాలెం ప్రాంతంలో ఇసుక దందా భారీగా జరుగుతోంది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక దందాపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.అయితే ఈ నిరసన విషయం తెలుసుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ సమస్య పరిష్కరించేందుకు పోలీసు స్టేషన్ వద్దకు వచ్చినట్లు ఆందోళనకారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆయనను కలిసేందుకు ఆందోళనకారులంతా పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లి నిరసనకు దిగారు. ఈ సమయంలోనే ఓ లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, అనంతరం పాదచారులపైకి దూసుకెళ్లింది. లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో కొంతమంది విద్యుత్ షాక్‌తోను, మరికొంతమంది ప్రమాదంలోను మరణించినట్లు సమాచారం. మొత్తం మృతుల సంఖ్య 20 మందికి పైగా ఉందని సమాచారం. కాగా, కాగా.. క్షతగాత్రులలో సీఐ సాయినాథ్, ఎస్ఐ రామకృష్ణ, ఇద్దరు పత్రికా ప్రతినిధులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/