Begin typing your search above and press return to search.
రాజయ్య ఇంటి మిస్టరీ పై సవాలక్ష సందేహాలు
By: Tupaki Desk | 5 Nov 2015 6:54 AM GMTమాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన దుర్ఘటనపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలకంగా భావిస్తున్న పలు వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. ప్రమాదం జరిగిందని చెబుతున్న బెడ్ రూంలో గ్యాస్ సిలిండర్లతో పాటు.. పిన్నును స్వాధీనం చేసుకున్నారు. ఇక.. ఇంట్లోని ఆహారపదార్థాల్ని సీజ్ చేశారు.
పూర్తిగా కాలిపోయిన మృతదేహాల తీరు పలు సందేహాలకు తావిచ్చేలా ఉందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని సందేహాలకు అస్సలు సమాధానాలు దొరకని పరిస్థితి.
* అగ్ని ప్రమాదమే జరిగిందని అనుకుంటే.. ఒంటికి మంటలు అంటుకున్నాక.. ఆ బాధ తాళ లేక అరుపులు అయినా అరుస్తారు కదా? అలాంటిదేమీ ఎందుకు లేదు?
* రాజయ్య కోడలు.. ముగ్గురు మనమలు పడి ఉన్న తీరు మత్తులో ఉన్నట్లుగా ఉండటం ఏమిటి?
* ప్రమాదవశాత్తు జరిగినా లేదంటే ఆత్మహత్య చేసుకున్నారని అనుకున్నా.. మరణించిన మృతదేహాల తీరు అనుమానాస్పదంగా ఉండటం ఏమిటి?
* ఇంట్లో పొగలు వస్తుంటే.. వాటిని రోడ్డు మీద వెళుతున్న వారు గుర్తించే వరకు.. ఇంట్లో వారికి ఎందుకు తెలియలేదు?
* కోడలు.. ముగ్గురు మనమలకు సంబంధించి తిన్న ఆహారంలో మత్తుమందు కలిపి ఆనంతరం కాల్చేశారా?
* గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు లీకైన సందర్బంలో నిప్పు రాజుకోవటానికి కారణం ఏమిటి? నిప్పు రాజుకోవటానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా? ఒకవేళ హటాత్తుగా కరెంటు స్విచ్ వేయటమే అయితే.. గదిలోపలి వారు మెలుకువగా ఉన్నట్లే. అదే జరిగితే.. ఒక్కసారి ఒళ్లంతా మంటలు అంటుకుంటే హాహాకారాలు చేస్తారు కదా? అలాంటి ఆనవాళ్లు లేకపోవటం ఏమిటి?
* నిద్రించే గదిలో రెండు గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఉన్నట్లు?
* రెండు సిలిండర్లు ఒకేసారి లీకు కావటం సాధ్యమేనా?
* సిలిండర్ లీకైన అగ్నిప్రమాదం జరిగితే సిలిండర్లు ఎలాంటి ప్రమాదానికి గురి కాకపోవటం ఏమిటి?