Begin typing your search above and press return to search.

య‌తి.. క‌చ్ఛితంగా 'అతి' మాత్ర‌మేనా?

By:  Tupaki Desk   |   1 May 2019 6:52 AM GMT
య‌తి.. క‌చ్ఛితంగా అతి మాత్ర‌మేనా?
X
భార‌తీయ పుర‌ణాల్లోనూ.. క‌థ‌ల్లో క‌నిపించే భారీ మంచు మ‌నిషి..మ‌రో మాట‌లో చెప్పాలంటే య‌తి అన్న‌ది ఇప్ప‌టివ‌ర‌కూ ఒక ఊహ మాత్ర‌మే. అయితే.. అందుకు భిన్నంగా తాము చేస్తున్న సాహ‌స‌యాత్ర‌లో త‌మ‌కు య‌తి పాద‌ముద్ర‌లు క‌నిపించాయంటూ భార‌త సైన్యం చేసిన ఒక సోష‌ల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ గా మార‌ట‌మే కాదు.. భారీ ఎత్తున చ‌ర్చ‌కు తెర తీసింది.

పుర‌ణాల్లో క‌నిపించే య‌తి.. క‌లికాలంలో కూడా ఉన్నాడా? అన్న‌ది ప్ర‌శ్న అయితే.. భారీ అడుగుజాడ‌ల్ని ప‌ట్టుకొని య‌తిగా అభివ‌ర్ణించ‌టం స‌మంజ‌స‌మేనా? అని ప్ర‌శ్నిస్తున్న వారు లేక‌పోలేదు. ఆర్మీ చెప్పిన దాని ప్ర‌కారం పాద‌ముద్ర‌లు 32 అంగుళాల పొడ‌వు.. 15 అంగుళాల వెడ‌ల్పు ఉన్నాయి. ఈ పాద‌ముద్ర‌ల్ని నేపాల్ కు స‌మీపంలోని మ‌క‌లు బేస్ క్యాంప్ ద‌గ్గ‌ర చూసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇవాల్టి డిజిట‌ల్ ప్ర‌పంచంలో య‌తి ఉండ‌టం సాధ్య‌మేనా? ఒక‌వేళ ఉంటే.. గుర్తించ‌కుండా ఉంటారా? అన్న‌ది క్వ‌శ్చ‌న్. అంతేనా.. హిమాల‌య‌ప్రాంతాల మీద శాటిలైట్ల‌ను స‌రిగ్గా పెడితే.. ఈ య‌తి క్యారెక్ట‌ర్ లెక్క‌లు తేలిపోవా? అన్న సందేహాల‌కు స‌మాధానం ఇచ్చే వారు క‌నిపించ‌రు.

ఇదిలా ఉంటే.. సైన్యం చెబుతున్న పాద‌ముద్ర‌ల్లో ఒక‌టి మాత్ర‌మే ఉండ‌టం.. య‌తి రెండు కాళ్ల‌తో ఉన్నాడ‌న్న మాట చెప్పిన‌ప్పుడు.. రెండింటిలోనూ వ్య‌త్యాసం ఎందుకు ఉంద‌న్న‌ది ఇప్పుడు మ‌రో ప్ర‌శ్న‌. ఫోటోలు య‌తి ఉన్నాడ‌న్న న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తున్నా.. ఉత్త ఫోటోల‌తోనే య‌తి ఉన్నాడ‌ని ఎలా ఫిక్స్ అవుతార‌న్న ప్ర‌శ్న వినిపిస్తోంది. శ‌తాబ్దాలుగా మిస్ట‌రీగా మారిన య‌తి ప్ర‌చారం వెనుక మ‌రేదైనా వ్య‌వ‌హారం ఉందా? అన్న సందేహాలు లేక‌పోలేవు.

య‌తి ఎపిసోడ్ ను బీజేపీ రాజ‌కీయం చేయ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. య‌తిపై విప‌క్ష నేత‌లు మాత్రం ఎట‌కారం చేసుకుంటున్నారు. చివ‌ర‌కు య‌తి కూడా క‌నిపించింది కానీ మోడీచెప్పిన మోడీ అచ్చేదిన్ మాత్రం క‌నిపించ‌లేదంటూ మాస్ట‌ర్ స్ట్రోక్ లాంటి స‌టైర్ వేశారు అఖిలేశ్‌. ఏది ఏమైనా.. ఒక్క ఫోటో మిన‌హాయించి య‌తి విష‌యంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌నే చెప్పాలి. ఈ కోణంలో చూసిన‌ప్పుడు య‌తిలో అతి కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.