Begin typing your search above and press return to search.

సందేహాల కుప్ప‌గా మారిన శ్రీ‌దేవి మృతి?

By:  Tupaki Desk   |   27 Feb 2018 4:34 AM GMT
సందేహాల కుప్ప‌గా మారిన శ్రీ‌దేవి మృతి?
X
అతిలోక సుంద‌రిగా యావ‌త్ దేశం పైనా త‌న ముద్ర వేసిన శ్రీ‌దేవి తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయింది. ఆమె ఇప్పుడో క‌మ్మ‌టి క‌ల. ఇప్ప‌టికే ఆమె మ‌ర‌ణం వేద‌న‌కు గురి చేస్తుంటే.. ఆమె మ‌ర‌ణం స‌హ‌జం కాద‌ని.. ప్ర‌మాద‌క‌ర‌మ‌న్నది ఒక విస్మ‌య‌మైతే.. ఆమె మ‌ర‌ణంపై దుబాయ్ అధికారులు సందేహాలు వ్య‌క్తం చేయ‌టం.. ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా.. ఎంత‌మంది కాంట్రాక్ట్ లోకి వెళ్లినా.. త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోతున్నారే కానీ.. ఎక్క‌డా వెన‌క్కి తగ్గ‌టం లేదు.

అంత‌ర్జాతీయంగా త‌మ ఇమేజ్ ను కాపాడుకోవ‌టం ముఖ్య‌మ‌న్న‌ట్లుగా వారు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌మ దేశంలో ఏదైనా ప‌ద్ధ‌తిగా జ‌రుగుతుందే త‌ప్పించి.. సామాన్యుల‌కు ఒక రూల్‌.. సెల‌బ్రిటీల‌కు మ‌రో రూల్ అన్న‌ది ఉండ‌న్న‌ట్లుగా వారి తీరు ఉంటోంది.

దుబాయ్ చ‌ట్టాలు.. విచార‌ణ ప్ర‌క్రియ‌కు మంచి పేరుంది. వారు ఎక్క‌డా రాజీ ప‌డ‌ర‌న్న మాట ప‌లువురు చెబుతుంటారు. శ్రీ‌దేవి మృతి విచార‌ణ విష‌యంలో ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గంట‌లు గ‌డుస్తున్న కొద్దీ శ్రీ మృతిపై సందేహాలు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. అదే స‌మ‌యంలో బోనీతో స‌హా.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఇప్ప‌టివ‌ర‌కూ మీడియాకు చెప్పిన వివ‌రాల‌న్నీ త‌ప్పుల త‌డ‌క‌గా ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

శ్రీ‌దేవి మ‌ర‌ణంపై బోనీ క‌పూర్ ప్రెస్ కు రిలీజ్ చేసిన నోట్ లో గుండెపోటుగా చెప్ప‌టం ఒక ఉదాహ‌ర‌ణ అయితే.. ఎక్క‌డా ట‌బ్ లో ప‌డిపోయిన విష‌యాన్ని చెప్ప‌లేదు. అంతేనా.. ట‌బ్ లో జారి ప‌డ్డార‌న్న మాట రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటు.. ఫోరెన్సిక్ నివేదిక అనంత‌రం.. బోనీక‌పూర్ ను గంట‌ల త‌ర‌బడి పోలీసులు విచారించ‌టం ఒక ఎత్తు అయితే.. ఈ రోజు మ‌రోసారి గంట‌ల త‌ర‌బ‌డి విచార‌ణ ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఈ కేసును దేశంలోనే అత్యంత ప‌వ‌ర్ ఫుల్ అధికారిగా చెప్పే ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ కు అప్ప‌గించ‌టం చూస్తే.. ఈ వ్య‌వ‌హారంపై దుబాయ్ అధికారులు ఎంత సీరియ‌స్ గా ఉన్నారో చెప్ప‌క‌నే చెప్పొచ్చు.

శ్రీ మ‌ర‌ణంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఆమె మ‌ర‌ణానికి దారి తీసిన అంశాలపై ప‌లు సందేహాలు వ‌స్తున్నాయి. బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మాచారం.. దుబాయ్ అధికార వ‌ర్గాలు.. మీడియా క‌థ‌నాల్ని చూసిన‌ప్పుడు క‌లిగే సందేహాలు చూస్తే..

1. శ్రీ మ‌ర‌ణాన్ని బోనీ త‌మ్ముడు ఎందుకు చెప్పారు?

2. బాత్రూంలో శ్రీ అచేత‌నంగా ప‌డి ఉండ‌టాన్ని చూసిన బోనీ తొలుత హోట‌ల్ సిబ్బందికి ఫోన్ చేయ‌కుండా త‌న స్నేహితుడికి ఎందుకు ఫోన్ చేశారు?

3. శ్రీ‌దేవిని దుబాయ్ లో ఉంచి బోనీక‌పూర్ ఎందుకు వెళ్లారు?

4. ముంబ‌యికి తిరిగి వ‌చ్చిన మూడు రోజుల‌కు బోనీ మ‌ళ్లీ ఎందుకు వెళ్లారు?

5. శ్రీ‌దేవికి రెండు రోజుల పాటు ప‌దే ప‌దే ఫోన్ చేసిందెవ‌రు?

6. స‌ర్ ప్రైజ్ డిన్న‌ర్ అంటూ బోనీ వెళ్లిన స‌మ‌యంలోనే శ్రీ మ‌ర‌ణించారా? అంత‌కు ముందేనా?

7. అస‌లు శ్రీ‌కి స‌ర్ ప్రైజ్ విజిట్ ఇవ్వాల‌ని ఎందుకు అనుకున్నారు?

8. హోట‌ల్ గ‌దిలో నుంచి శ్రీ రెండు రోజుల పాటు ఎందుకు బ‌య‌ట‌కు రాలేదు?

9. హోట‌ల్ గ‌దిలో నుంచి శ్రీ రావ‌టం లేద‌ని తెలిసే బోనీ దుబాయ్ కి మ‌ళ్లీ వెళ్లారా?

10. మ‌ర్వా పెళ్లిలో బోనీ మొద‌టి భార్య బంధువుల‌తో గొడ‌వ జ‌రిగిందా?

11. ఆస్తి వివాద‌మే గొడ‌వ‌కు కార‌ణ‌మా?

12. త‌న పిల్ల‌ల కంటే ఎక్కువ‌గా మొద‌టి భార్య పిల్ల‌ల విష‌యంలో బోనీ శ్ర‌ద్ధ చూపిస్తున్నార‌ని శ్రీ ఆరోపించారా?

13. ఈ విష‌యం మీద భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుందా?

14. బాత్ ట‌బ్ లో శ్రీ‌ని మొద‌ట చూసింది బోనీనా? హోట‌ల్ సిబ్బందా?

15. బాత్రూం త‌లుపుల్ని బోనీ తెరిచి వెళ్లార‌ని చెబుతున్నారు? బోనీ ఆ ప‌ని చేసే అవ‌కాశం ఉందా?

16. శ్రీ మ‌ర‌ణించిన సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల మ‌ధ్య‌లో ఏం జ‌రిగింది?

17. దుబాయ్ లోని విధానాల ప్ర‌కారం ప్రాణాల‌తో ఉన్న వారిని (కొన ఊపిరితోనైనా) మాత్ర‌మే ఆసుప‌త్రికి త‌ర‌లిస్తారు. ఒక‌వేళ అంబులెన్స్ లో వెళ్లే స‌మ‌యంలో ప్రాణాలు పోయినా.. వెంట‌నే పోలీసుల వ‌ద్ద‌కు తీసుకెళ‌తారే కానీ ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌రు. ఈ నేప‌థ్యంలో శ్రీ ను ఆసుప‌త్రికి త‌ర‌లించే స‌మ‌యంలో ఆమె ప్రాణాల‌తో ఉన్నారా? చ‌ట్టాల ప‌ట్ల అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండే దుబాయ్ లో శ్రీ ను ఆసుప‌త్రికి త‌ర‌లించే విష‌యంలోనే త‌ప్పు జ‌రిగిందా?

18. సాయంత్రం 6.30 గంట‌ల‌కు బాత్ ట‌బ్ లో శ్రీ‌దేవిని చూసిన‌ప్పుడు రాత్రి 9 గంట‌ల వ‌ర‌కూ పోలీసుల‌కు ఎందుకు చెప్ప‌న‌ట్లు?

19. ఒక‌వేళ ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించి ఉంటే.. ఆ విష‌యాన్ని చెప్ప‌కుండా కార్డిక్ అరెస్ట్ అన్న మాట‌ను ఎందుకు చెప్పిన‌ట్లు?

20. హోట‌ల్లో అందుబాటులో ఉన్న అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల్ని ఎందుకు పొంద‌లేదు?

21. ఎలా మ‌ర‌ణించార‌న్న విష‌యాన్ని వైద్యులు చెప్పాల్సింది పోయి.. బోనీక‌పూర్ త‌మ్ముడు ఎందుకు చెప్పిన‌ట్లు?

22. సందేహాల నివృతి కోసం బోనీని విచారించిన అధికారులు సంతృప్తి చెంద‌క‌పోవ‌టానికి కార‌ణం ఏమిటి?