Begin typing your search above and press return to search.
నదుల అనుసంధానం..బాబుతో కానిది జగన్ సాధించేస్తున్నారే
By: Tupaki Desk | 4 Feb 2020 1:01 PM GMTనవ్యాంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధానం గురించి ఎప్పటి నుంచో లెక్కలేనన్ని ప్రకటనలు వచ్చిన సంగతి తెలిసిందే. గోదావరి - కృష్ణా నదుల నుంచి నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్న నీటిని మళ్లించి సద్వినియోగం చేసే దిశగా నదుల అనుసంధానాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాను సీఎంగా ఉన్న సమయంలోనే ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలు... పేపర్లను దాటి కార్యరూపం దాల్చిన దాఖలా లేదు. అయితే చంద్రబాబు తర్వాత సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నదుల అనుసంధానంపై ఓ స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతున్నారనే చెప్పాలి. ఈ క్రమంలో జగన్ కొత్తగా ప్రతిపాదించిన నదుల అనుసంధానానికి ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చెప్పాలి.
మంగళవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రాజ్యసభలో లేవనెత్తిన నదుల అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విస్పష్ట ప్రకటన చేశారు. జగన్ ప్రతిపాదించిన నదుల అనుసంధానానికి కేంద్రం కూడా సానుకూలంగానే ఉందని, ఇందులో భాగంగా గతంలో ప్రతిపాదించిన గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్లించడం వరకే పరిమితం కాకుండా గోదావరి జలాలను ముందుగా కృష్ణా నదిలోకి - అక్కడి నుంచి పెన్నా నదిలోకి - అక్కడి నుంచి కావేరీ నదిలోకి జలాలను మళ్లించే దిశగా... ఈ బృహత్కర పథకంపై పూర్తి అధ్యయనం కోసం నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఎన్ డబ్ల్యుడీఏ) ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు షెకావత్ పేర్కొన్నారు. ఈ ఏజెన్సీ ఏర్పాటుకు దారి తీసిన పరిణామాలను కూడా షెకావత్ క్లిస్టర్ క్లియర్ గా వివరించడం గమనార్హం.
షెకావత్ తన ప్రకటనలో ఏమన్నారంటే.. ‘‘దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ - ప్రకాశం - నెల్లూరు జిల్లాలను ఆదుకునేందుకు గోదావరి నది బేసిన్ నుంచి కృష్ణా నది బేసిన్ కు నీరు మళ్ళించే అవకాశాలను పరిశీలించివలసిందిగా కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ గోదావరి - కృష్ణా నదుల అనుంసంధానం ప్రాజెక్ట్‌కు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు. గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరీ నదుల అనుసంధానంపై సవివరమైన ప్రాజెక్ట్ నివేదికను రూపొందించే బాధ్యతను ఎన్‌డబ్ల్యుడీఏకు అప్పగించాం. ఆ సంస్థ సిద్ధం చేసిన ముసాయిదా డీపీఆర్‌పై తమ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతూ సంబంధిత రాష్ట్రాలకు పంపించాం. గోదావరి - కావేరీ లింక్ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా మూడు లింక్ లు ఉంటాయి. అవి గోదావరి (ఇంచంపల్లి లేదా జానంపేట) - కృష్ణా (నాగార్జునసాగర్) లింక్ - కృష్ణా (నాగార్జునసాగర్) పెన్నా (సోమశిల) లింక్, పెన్నా (సోమశిల) - కావేరీ (గ్రాండ్ ఆనకట్ట) లింక్. ఈ లింక్ ప్రాజెక్ట్‌ల ద్వారా నిరుపయోగంగా పోతున్న 247 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది. గోదావరి-కృష్ణా లింక్ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా - గుంటూరు - ప్రకాశం - చిత్తూరు - నెల్లూరు జిల్లాల్లో 3.45 లక్షల నుంచి 5.04 లక్షల హెక్టార్ల భూములకు ఏటా సాగునీటి వసతి కల్పించవచ్చు. అలాగే నాగార్జునసాగర్ కుడి - ఎడమ కాల్వల కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించవచ్చు. నదుల లింకింగ్ ప్రాజెక్ట్ పై సంబంధిత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన అనంతరం తుది డీపీఆర్ ను రూపొందించి - చట్టపరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత ప్రాజెక్ట్ పనులు మొదలవుతాయి’’ అని షెకావత్ సవివర ప్రకటన చేశారు.
మొత్తంగా షెకావత్ ప్రకటనను తరచి చూస్తే... చంద్రబాబు చెప్పినట్టుగా ఏపీలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతోనే ఆగిపోకుండా... ఈ అనుసంధానాన్ని పెన్నా - కావేరీ వరకు కూడా పొడిగించే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి. ఇదే జరిగితే... ఏపీలోని రాయలసీమతో పాటు ప్రకాశం - నెల్లూరు జిల్లాలకు కూడా సాగు - తాగు నీటి కొరత అన్నదే ఉండదన్న భావన వ్యక్తమవుతోంది. అంటే... కరువు సీమగా పేరుపడ్డ రాయలసీమ ఈ ప్రాజెక్టు సాకారమైతే... సస్యశ్యామలమైనట్టే. ఇదే జరిగితే... ఏపీలో ఇక జగన్ కు తిరుగు ఉండదన్న వాదన కూడా వినిపిస్తోంది. చంద్రబాబు తమ ప్రతిపాదనలన్నింటినీ కేవలం పేపర్లకే పరిమితం చేయగా... జగన్ మాత్రం తాను అనుకున్న పథకాలకు కార్యరూపం ఇచ్చే దిశగా కదులుతున్నారని చెప్పాలి. అంటే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించడం వరకే చంద్రబాబు పరిమితమైతే.. జగన్ దానిని సాకారం చేస్తున్నారన్న మాట.