Begin typing your search above and press return to search.
ఒక్క డోసు చాలు .. రెండోది అవసరం లేదు .. వారి అధ్యయనంలో కీలక అంశాలు వెల్లడి
By: Tupaki Desk | 11 Jun 2021 7:30 AM GMTజబ్బును నయం చేయడానికి డాక్టర్లు ఇచ్చే మందు కంటే దైర్యం చెప్పే మాటలే ఎక్కువగా పని చేస్తాయి. ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి గత కొంత కాలంగా కరోనా వైద్యానికి చేస్తున్న సూచనలు ఎంతో భరోసా ఇస్తున్నాయి. మే చివరి కల్లా కరోనా తగ్గుముఖం పడుతుందని ఆయన శాస్త్రీయంగా వెల్లడించారు. దీనితో మరో వారం పది రోజులు జాగ్రత్తగా ఉంటే చాలు, కరోనా గండం నుంచి గట్టెక్క వచ్చని ప్రజలు మానసికంగా సంసిద్ధులయ్యారు. అందుకు తగ్గట్టు ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా తగ్గిన వారికి ఒక్కడోసు చాలు అని చెప్పడం ద్వారా ఆయన మరింత బలాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక్క డోసు గురించి కాసేపు పక్కన పెడితే, ఆయన నుంచి వచ్చే ఒక్కో మాట కరోనా ను పారదోలడానికి ఉపయోగడపతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కరోనా వైరస్ బారిన పడి తగ్గిన వారికి ఒక్క టీకా డోసే మంచి ఫలితమిస్తోందని, వైరస్ బారినపడిన నెల రోజుల తర్వాత ఒక డోసు పొందడం ద్వారా వీరిలో గణనీయంగా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లుగా వైద్య నిపుణులు గుర్తించారు. యాంటీబాడీలు మూడింతలు అధికంగా ఉన్నట్టు తేల్చారు. అదే వైరస్ బారినపడని వ్యక్తుల్లో ఒక డోసు పొందిన తర్వాత యాంటీబాడీల వృద్ధి సాధారణంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ కీలక పరిణామాల పై హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి, డాక్టర్ ఎం.శశికళ, డాక్టర్ జే.శశిధర్, డాక్టర్ జి.దీపిక, డాక్టర్ వి. రవికాంత్, డాక్టర్ వి.వెంకట కృష్ణ, డాక్టర్ వై.సాధన, డాక్టర్ కె.ప్రగతి సంయుక్తంగా పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధన పత్రం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ లో అనే ప్రసిద్ధ వైద్య పత్రికలో ప్రచురితమైంది.
వ్యాక్సిన్ కు సంబంధించి పలు సందేహాలకు ఈ అధ్యయనంలో వైద్య నిపుణులు సమాధానమిచ్చారు. తమ పరిశోధనలో కరోనా బారిన పడ్డవారిని, సాధారణ ప్రజలను పరిగణలోకి తీసుకున్నారు. వారికి వివిధ వయసుల వారీగా ఒక డోసు టీకాను ఇచ్చి అధ్యయనం చేశారు. కరోనా సోకిన వారెవరైనా నెల రోజుల తర్వాత టీకా తీసుకోవచ్చన్నారు. అలాంటి వారికి ఒక్క డోసుతోనే యాంటీబాడీలు బాగా వృద్ధి చెందుతాయన్నారు. రెండోది అవసరం లేదని చెప్పడం విశేషం. ప్రభుత్వానికి టీకాలపై ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఇలాంటి వారికి ఏడాది పాటు రక్షణ ఉంటుందనే అంచ నాల నేపథ్యంలో బూస్టర్ డోసును ఏడాది తర్వాత ఇవ్వచ్చు అని అన్నారు. ఈ అధ్యయన అంశాలను భారతీయ వైద్య పరిశోధన మండలికి(ఐసీఎంఆర్ కు) కూడా పంపించినట్టు ఆయన తెలిపారు.