Begin typing your search above and press return to search.

కేసీఆర్ కలిసింది మొదలు కాళ్లు పట్టుకొని కాక పట్టటమేనా?

By:  Tupaki Desk   |   16 Nov 2022 9:30 AM GMT
కేసీఆర్ కలిసింది మొదలు కాళ్లు పట్టుకొని కాక పట్టటమేనా?
X
ఆయనో అలాంటి ఇలాంటి అధికారి కాదు. ఆయన్ను ఆయన ఛాంబర్ వద్దకు వెళ్లి కలవాలంటే సామాన్యుడే కాదు.. ఒక స్థాయి వారికి కూడా ఆయన అందుబాటులోకి రారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అత్యుత్తమ స్థాయి అధికారి. ఆయన స్థాయిని సింఫుల్ గా చెప్పాలంటే.. రాష్ట్రంలోని ఏ ప్రైవేటు ఆసుపత్రి ఫ్యూచర్ ను అయినా ఆయన ఇట్టే డిసైడ్ చేయగలరు. అలా అని.. మంత్రి హరీశ్ రావు లేరని కాదు. అంతో ఇంతో ఇబ్బందులకు గురి చేసే సత్తా ఆయన సొంతం. అలాంటి కీలక స్థానంలో ఉన్న ఆయనకు ఈ మధ్యన రాజకీయాల మీద మోజు పుట్టిందని చెబుతారు.

కరోనా సమయంలో అతగాడి మీద ఆరోపణలు వచ్చినా.. ఆయన పని తీరు మిగిలిన అధికారుల కంటే మెరుగ్గా ఉందన్న మాట వినిపించింది. ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగాలని ఆయన ఆశ పడుతున్నారు. అందుకోసం ఆయన తెర వెనుక చాలానే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా ఒకే రోజున రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆన్ లైన్ పద్దతిలో ప్రారంభించిన వైనం తెలిసిందే.

అలా ప్రారంభమైన వైద్య కళాశాలల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. దీంతో.. కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పుకోవటానికి ప్రగతి భవన్ కు వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల పోస్టులో ఉన్న డాక్టర్ గడల శ్రీనివాసరావు.

ఈ సందర్భంగా ఒక చిట్టీని సీఎం కేసీఆర్ కు ఇవ్వటం.. దాన్ని ఆయన జేబులో పెట్టుకున్నారు. అదే సమయంలో ఆయన ఏదో రిక్వెస్టు చెప్పటం.. అందుకు కేసీఆర్ తల ఊపటం తెలిసిందే. అక్కడితో ఆగని గడల శ్రీనివాసరావు.. సీఎం కేసీఆర్ మీద తనకున్న భక్తి భావాన్ని తెలియజేసేలా కాళ్లకు నమస్కారం పెట్టేశారు.

అక్కడితో ఆగని ఆయన కేసీఆర్ వెంటే రావటం.. ఆయన రిక్వెస్టుకు కేసీఆర్ తల ఊపటం కనిపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బయటకు వస్తున్న కేసీఆర్ కాళ్లకు మరోసారి నమస్కారం పెట్టేందుకు ఆయన పడిన తపన.. తాపత్రయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ ఆయన రిక్వెస్టు మరేమిటో కాదు.. కొత్తగూడెం టికెట్ ను ఆయన ఆశిస్తున్నారు. కేసీఆర్ కాళ్ల మీద పడటం ద్వారా.. తనకున్న విధేయతను గుర్తించి టికెట్ ఇస్తారన్న నమ్మకంతో ఆయన పడిన తపన సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తీరును పలువురు తిట్టిపోస్తున్నారు. ఆయనకు చెందిన చిట్టి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.