Begin typing your search above and press return to search.
దేశంలో కరోనా ఇంకా మూడో దశకు చేరలేదు..
By: Tupaki Desk | 29 March 2020 6:10 AM GMTకరోనా భారత్‌ను కలవరపెడుతోంది. ప్రస్తుతం పాజిటివ్ కేసులు దాదాపు వెయ్యికి చేరువవుతోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి రెండో దశకు చేరుకుంది. ఈ క్రమంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశకు చేరలేదని ఇండియా కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటించింది. కరోనా కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ జరగలేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో దాదాపు పది శాతం మందికి తీవ్రమైన శ్వాస సంబంధ సమస్య ఉన్నట్లు తెలిపింది.
‘కరోనా లక్షణాలతో ఇప్పటివరకు ఉన్న కేసుల్లో కరోనా పాజిటివ్ సోకిన వారికి విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు వారి కుటుంభ సభ్యులకు మాత్రమే సోకింది. వారికి సంబంధం లేని ఇతరులకు ఇంతవరకు కరోనా వ్యాపించలేదు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అనడానికి ఎలాంటి ఆధారాల్లేవు. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దు’అని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త గంగాఖేద్కర్ వెల్లడించారు.
దీంతోపాటు భారతదేశంలో కరోనా నిర్ధారణ - పరీక్షలపై ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పటివరకు 150 ప్రభుత్వ - ప్రైవేటు ల్యాబ్ లలో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించింది. కరోనాపై ఆందోళన చెలరేగిన సమయంలో సెల్ఫ్ టెస్టింగ్ కిట్లు కావాలని డిమాండ్ వస్తోంది. అయితే వాటిని సరైన మార్గదర్శకాలు లేకుండా వాటిని వినియోగిస్తారని - అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందనే ఉద్దేశంతో వాటిని అనుమతించడం లేదని ప్రకటించారు. వైద్యుల అనుమతి లేకుండా సొంత నిర్ణయాలతో మందులు వాడటం మంచిది కాదని హెచ్చరించారు. దేశంలో కరోనా కేసులు వెయ్యికి చేరువలో ఉండగా, 20 మంది మృతిచెందారు.