Begin typing your search above and press return to search.

'దిశ' నిందితుల‌ ఎన్‌ కౌంట‌ర్‌..పోలీసుల‌కు అనుకూలంగా క‌మిటీ స‌భ్యుడి వ్యాఖ్య‌లు..!

By:  Tupaki Desk   |   22 Dec 2019 10:35 AM GMT
దిశ నిందితుల‌ ఎన్‌ కౌంట‌ర్‌..పోలీసుల‌కు అనుకూలంగా క‌మిటీ స‌భ్యుడి వ్యాఖ్య‌లు..!
X
దేశాన్ని కుదిపేసిన హైద‌రాబాద్ లో జ‌రిగిన‌ `దిశ‌` ఘ‌ట‌న‌ - అనంత‌రం స‌ద‌రు న‌లుగురు నిందితుల ఎన్ కౌంట‌ర్ విష‌యం తెలిసిందే. అయితే, దిశ ఘ‌ట‌న ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. దీనికి కార‌ణ‌మైన న‌లుగురు నిందితు ల‌ను వారంలోనే ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశంలో ఎన్‌ కౌంట‌ర్ చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎన్ కౌంట‌ర్ పై సామాన్య ప్ర‌జ‌లు ఆనందం వ్య‌క్తం చేశారు. ఇక‌, బాధిత కుటుంబం హ‌ర్షం వ్య‌క్తం చేయ‌డంతో పాటు త‌మ కు స‌త్వ‌ర‌మే న్యాయం అందింద‌ని వ్యాఖ్యానించింది. మెజారిటీ మ‌హిళా వ‌ర్గం కూడా త‌క్ష‌ణ న్యాయంపై ఆనందం వ్య‌క్తం చేసింది. దిశ ఘ‌ట‌న‌లో న‌లుగురు నిందితుల‌ను ఎన్ కౌంట‌ర్ చేసిన పోలీసుల‌పై పూల వ‌ర్షం కురిపించారు కూడా..!

అయితే, ఇదే ఎన్ కౌంట‌ర్‌ ను మానవ హక్కుల సంఘాలు, ప్ర‌జా సంఘాలు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టాయి. దీంతో అనేక రూపాల్లో ఈ ఎన్ కౌంట‌ర్‌ పై విచార‌ణ కోరుతూ.. రాష్ట్ర హైకోర్టు - సుప్రీం కోర్టుల్లో పిటిష‌న్ల‌ను దాఖలు చేశారు. వీటిని విచారించిన సుప్రీం కోర్టు.. ఎన్‌ కౌంట‌ర్‌ పై ఉన్న అనుమానాల‌ను - ప్ర‌భుత్వ - పోలీసు వాదన‌ల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని నిజాన్ని నిర్దారించేందుకు త్రిస‌భ్య క‌మిటీని వేసింది. ఈ క‌మిటీలో మాజీ న్యాయమూర్తి సిర్ పుర్కర్ చైర్మన్‌ గా బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా - సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్నారు. వీరు త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ వ‌చ్చి.. త‌మ విచార‌ణ‌ను ప్రారంభించ‌నున్నారు. దీంతో అంత‌టా ఉత్కంఠ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఇప్ప‌టికే ప్ర‌జాసంఘాలు - హ‌క్కుల సంఘాల నుంచి పోలీసుల‌పై వ్య‌తిరేక‌త రావ‌డం - ఎన్ కౌంట‌ర్ విషయంలో సుప్రీం కోర్టు సూచ‌న‌ల‌ను పోలీసులు పాటించ‌క‌పోవడం నేప‌థ్యంలో క‌మిటీ ద‌ర్యాప్తు అత్యంత కీల‌కంగా మారింది. దీంతో అటు పోలీసులు - ఇటు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా త‌మ‌కు ఎలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డుతుందోన‌ని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి అయితే, ఇంత‌లోనే అటు ప్ర‌భుత్వానికి - ఇటు పోలీసులకు కూడా ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా ఈ క‌మిటీలో స‌భ్యుడిగా ఉన్న సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప్రైవేటు ప‌నిపై హైద‌రాబాద్ వ‌చ్చారు.

రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మహాపిరమిడ్ 2019కి ముఖ్యఅతిథిగా హాజ‌రైన కార్తికేయ‌న్ ప‌రోక్షంగా దిశ ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావించారు. మహిళలపై అత్యాచారాలు - హత్యలు జరగడంపై ఆయన తీవ్ర ఆవేదన‌ వ్యక్తం చేశారు. భారత దేశంలో స్త్రీలను దేవతామూర్తులుగా కొలుస్తార‌ని, అలాంటి క‌ర్మ భూమిలో అతివ‌ల‌కు ర‌క్ష‌ణ లేక‌పోవ‌డం - వారిపై అత్యాచారాలు - వేధింపులు చోటు చేసుకోవ‌డం సిగ్గుచేటని ఆయన అభిప్రాయ ప‌డ్డారు. అయితే అదే స‌మ‌యంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను కోర్టులు గాని - పోలీసులు గాని కట్టడి చేయలేకపోతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు ఓ ర‌కంగా దిశ నిందితులను ఎన్‌కౌంట‌ర్ చేసిన వారికి కాస్త బూస్ట్ ఇచ్చేలానే ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాము త‌ప్పు చేశామ‌ని ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఇప్పుడు కార్తికేయ‌న్ వ్యాఖ్య‌లు వారికి కొంత నైతిక స్థ‌యిర్యాన్ని అందించాయ‌ని చెబుతున్నారు.