Begin typing your search above and press return to search.

డాక్టర్ రెడ్డీస్ తో రష్యా ఒప్పందం.. భారత్ కు 10 కోట్ల డోసులు

By:  Tupaki Desk   |   16 Sep 2020 2:30 PM GMT
డాక్టర్ రెడ్డీస్ తో రష్యా ఒప్పందం.. భారత్ కు 10 కోట్ల డోసులు
X
ప్రపంచంలోనే అందరికంటే ముందు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ రష్యాదే.. రష్యా ‘స్పుత్నిక్-వీ’ పేరు రెండు ట్రయల్స్ మాత్రమే నిర్వహించి వ్యాక్సిన్ ను విడుదల చేసింది. మూడో దశలో ఉన్న ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను తాజాగా భారత్ లోనూ జరిపేందుకు రెడీ అయ్యింది.

ఈ క్రమంలో భారత ఫార్మా దిగ్గజం ‘డాక్టర్ రెడ్డీస్’తో రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ లో క్లినికల్ ట్రయల్స్ చేపట్టడంతోపాటు 10 కోట్ల వ్యాక్సిన్ డోసులను భారత్ లో సరఫరా చేసేందుకు వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రం నుంచి అనుమతల అనంతరం ఈ ప్రక్రియ మొదలు కానుంది.

రెండు దశల్లో సురక్షితమైన రష్యా కరోనా వ్యాక్సిన్ ను మూడో దశ ప్రయోగాలను భారత్ లో జరపబోతున్నాం. అనుమతులు రాగానే 10 కోట్ల డోసులను డాక్టర్ రెడ్డీస్ కు అందిస్తాం అని రష్యా పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం చివరలోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని వివరించింది. భారత్ కు వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.

రష్యా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు తాము చేపడుతామని.. కేంద్రం అనుమతించాక.. నిబంధనల ప్రకారం చేస్తామని డాక్టర్ రెడ్డీస్ కోచైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు.

రష్యా వ్యాక్సిన్ రెండు దశలకే విడుదల చేసింది. పైగా ప్రయోగాల్లోనూ ఎలాంటి దుష్ప్రభావాలు లేవని ప్రముఖ జర్నల్స్ ప్రచురించాయి. దీంతో రష్యా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు భారత్ లో చేసి ఇక్కడ ప్రజలకు అందించాలని డాక్టర్ రెడ్డీ, రష్యా ఒప్పందం చేసుకోవడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దీనిపై రష్యా అధికారులతో చర్చలు జరిపేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది.