Begin typing your search above and press return to search.
‘అమ్మ’ను కేసీఆర్ రూట్లో వెళ్లమంటున్నారు
By: Tupaki Desk | 17 July 2016 5:15 AM GMTఈ వార్తను చదివితే తెలంగాణ అధికారపక్ష నేతలు.. ఆ పార్టీని విపరీతంగా అభిమానించే వారి సంతోషానికి హధ్దులు ఉండవు. ఎందుకంటే.. వారు ఊహించని ప్రశంస ఒక సీనియర్ నేత నుంచి రావటం.. అది కూడా రాష్ట్రం కాని రాష్ట్రానికి చెందిన నేత కావటం గమనార్హం. తమిళనాడులోని పొట్టాలి మక్కల్ కట్చి నేత డాక్టర్ రామదాసు తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శనంగా తీసుకోవాలని ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సూచించారు.
పలుమార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి..‘అమ్మ’ బ్రాండ్ తో అనూహ్యమైన సంక్షేమ పథకాలు అందించిన అమ్మ జయలలితనే.. కేసీఆర్ ను ఫాలో కావాలంటూ రామదాసు వ్యాఖ్యానించటం విశేషంగా చెప్పాలి. తెలంగాణలో కేసీఆర్ అవినీతికి చెక్ పెట్టారని.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ పథకాలు బాగున్నాయని.. ఆయన పాలనా తీరును జయలలిత అనుసరించాలని సూచించటం గమనార్హం. దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరు మీద నిఘా వర్గాలతో చేయించిన సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ర్యాంకును సాధించిన విషయాన్ని గుర్తు చేసిన రామదాసు.. ఈ ర్యాంకు రావటానికి కారణం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలే అని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ.. మిషన్ కాకతీయ పేరిట చేపట్టిన పథకాల్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించటం గమనార్హం. టీఆర్ఎస్ నేతలకు ఇంతకు మించిన సంతోషకరమైన వార్త ఇంకేం ఉంటుంది.