Begin typing your search above and press return to search.

డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్పు ..కొత్త పేరు ఏంటంటే ?

By:  Tupaki Desk   |   20 Jan 2021 12:27 PM GMT
డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్పు ..కొత్త పేరు ఏంటంటే ?
X
డ్రాగన్ ఫ్రూట్‌ పేరును కమలంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని గుజరాత్‌ సీఎం తెలిపారు. పండు బయటి ఆకృతిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. డ్రాన్‌ ఫ్రూట్‌.. తామర పుష్పాన్ని పోలి ఉంటుందని, ఈ మేరకు పేరు మార్చనున్నట్లు తెలిపారు. సీఎం హార్టికల్చర్‌ డెవలప్‌ మెంట్‌ మిషన్‌ ను మంగళవారం ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ ను కమలం పండ్లుగా పిలిచేందుకు పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు.

డ్రాగన్‌ ఫూట్‌ పేరు చైనాతో ముడి పడి ఉందని, ఈ మేరకు పేరు మార్చామన్నారు. ఆసక్తికర విషయం ఎంటంటే తామర పువ్వు బీజేపీ చిహ్నం కాగా.. గాంధీనగర్‌లోని గుజరాత్‌ బీజేపీ ప్రధాన కార్యాలయానికి ‘శ్రీ కమలం’ అని పేరు పెట్టారు. డ్రాగన్ అంటే చైనాకు పర్యాయపదం. చైనాను డ్రాగన్ కంట్రీ అని కూడా మనం పిలుస్తుంటాం. సరిహద్దుల్లో చైనా బలగాలు భారత సైనికులను హతమార్చిన తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే.

ఆస్తమా, డయాబెటిస్ వంటి వ్యాధుల చికిత్సలో డ్రాగన్ ఫ్రూట్ సహాయపడుతుందని చాలామంది నమ్ముతారు. పలు దేశాల్లో ‘పిటయా’ పేరుతోనూ పిలుస్తుంటారు. డ్రాగన్ ఫ్రూట్ భారతీయ నగరాల్లో కిలోకు రూ.350 నుంచి 500 రూపాయలకు విక్రయిస్తుంటారు.యాంటీ ఏజింగ్, యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉన్నాయి.