Begin typing your search above and press return to search.
చైనా అతి.. అరుణాచల్ ప్రదేశ్ లో 15 ప్రాంతాలకు పేర్లు పెట్టేసిన డ్రాగన్
By: Tupaki Desk | 31 Dec 2021 5:33 AM GMTచెప్పే మాటకు.. చేసే దానికి ఏ మాత్రం సంబంధం ఉండని తీరు చైనాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటామని చెబుతూనే.. అందుకు భిన్నంగా వ్యవహరించే ధోరణి డ్రాగన్ దేశానికి ఎక్కువ. అందుకు తగ్గట్లే తాజాగా ఆ దేశం వ్యవహరించిన తీరు.. తప్పు పట్టేలా ఉంది. చర్చలతో రెండు దేశాల మధ్య నెలకొన్న విభేదాల్ని పరిష్కరించుకుందామని చెబుతూనే.. తాను చేయాల్సిన పనిని తాను చేసుకుంటూ పోవటం చైనాకు అలవాటే. అలాంటి ధోరణిని ప్రదర్శించిన చైనా.. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో అతి చర్య ఒకటి చేపట్టింది.
భారత్ లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ లో 15 ప్రాంతాలకు అధికారిక చైనీస్ పేర్లను పెడుతున్నట్లుగా ప్రకటించింది. ఈ ప్రకటనను భారత్ తీవ్రంగా తప్పు పట్టింది. అరుణాచల్ ప్రదేశ్ ఎన్నటికి తమ దేశంలో అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టం చేయటంతో పాటు.. పేర్లు పెట్టినంత మాత్రాన వాస్తవాన్ని చైనా మార్చలేదని తేల్చి చెప్పింది. తాజాగా చైనా అధికారిక మీడియా సంస్థ అయిన గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు చైనీస్.. టిబెటన్.. రోమన్ అక్షరాలతో కూడిన అధికారిక పేర్లను పెట్టినట్లుగా ప్రకటించింది.
నిజానికి ఇలా పేర్లు పెట్టటం చైనాకు అలవాటే.
2017లో కూడా ఇదే రీతిలో ఆరు ప్రాంతాలకు అధికారిక పేర్లు పెట్టినట్లుగా ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని దక్షిణ ప్రాంతం తమ దేశంలో భాగమని చైనా వాదిస్తోంది. దీన్ని భారత్ తీవ్రంగా తప్పు పడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో భారత నేతలు ఎవరు పర్యటించినా.. ఆ వెంటనే చైనా ఏదో ఒక ప్రకటన చేయటం అలవాటే. తాజాగా మాత్రం.. ఆ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు అధికారిక పేర్లు పెట్టటం ద్వారా.. మరోసారి కాలు దువ్వేసింది కొంతకాలంగా అరుణాచల్ ప్రదేశ్ ను ‘జన్ గ్నాన్’ అనే చైనీస్ పేరుతో పిలుస్తోంది. అయితే.. దీన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. తాజాగా మాత్రం చైనా కేబినెట్ స్టేట్ కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్యను చేపట్టినట్లుగా చెబుతున్నారు. చైనా కొత్తగా పేర్లు పెట్టిన 15 ప్రాంతాల్లో 8 ప్రాంతాలు రెసిడెన్షియల్ ప్రాంతాలు ఉండటం గమనార్హం.
చైనా పెట్టిన పేర్లను చూస్తే..
1. సెంగ్కెజాంగ్
2. దాగ్లుంగ్
3. జాంగ్
4. మనిగాంగ్
5. డుడింగ్
6. మిగ్ పెయిన్
7. గోలింగ్
8. డంబా
9. మెజాగ్
అంతేకాదు నాలుగు పర్వతాలకు వామో రి.. డు రి.. లన్ జుబ్ రి.. కున్ మింగ్ జింగ్ ఫెంగ్ అనే పేర్లను పెట్టినట్లుగా పేర్కొంది. వీటితో పాటు ఒక పర్వత మార్గానికి ‘సె లా’ అని పేరు పెట్టి.. రెండు నదులకు జెన్ యోగ్మో.. దులైన్ అన్న పేర్లను పెట్టింది.