Begin typing your search above and press return to search.

శృంగార సామర్థ్యం పెంచుకోవడానికి ఆ కాఫీ తాగాడు..చివరకు షాక్

By:  Tupaki Desk   |   1 Jun 2022 2:30 AM GMT
శృంగార సామర్థ్యం పెంచుకోవడానికి ఆ కాఫీ తాగాడు..చివరకు షాక్
X
శృంగారం దివ్యౌషధం. దాన్ని అస్వాదించాలే గానీ స్వర్గంలో తేలినట్టుంది. శృంగార పురుషులు చాలా మంది దీన్ని ఎంజాయ్ చేసే వారే. అయితే కొందరికీ మాత్రం అదో పెద్ద టాస్క్ లా మారిపోతుంది. పని ఒత్తిడి, బిజీ లైఫ్ లో శృంగారం చేసే ఓపిక, ఆసక్తి సన్నగిల్లిపోతోంది. అందుకే శృంగారాన్ని పెంచే సాధనాల వైపు వారు మరలుతున్నారు. వీటికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఇవన్నీ విపరీతంగా అమ్ముడైపోతున్నాయి. సుఖప్రాప్తి కోసం వీటిని చాలా మంది కొనేందుకు ఎగబడుతున్నారు.

సింగపూర్ లోనూ ఒక వ్యక్తి అంగస్తంభన సమస్యను తగ్గించి సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందించే ఓ కాఫీని తాగాడు. తాగిన తర్వాత అతడి మూతి వాచిపోయి.. శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ మొదలయ్యాయి. చివరకు అతడు ఆస్పత్రి పాలయ్యాడు.

లైంగిక వ్యవహారాల్లో సింగపూర్ హెల్త్ సైన్సెస్ అథారిటీ డ్రగ్ ను తీసుకోవద్దని ప్రజలను హెచ్చరించడంతో ఒక వ్యక్తి ప్రైమ్ కోపీ పెజుయాంగ్ 3 ఇన్ 1 అనే లైంగిక పెరుగుదల ప్రోడక్ట్స్ ను వినియోగించాడు. ఈ పదార్థంలో అంగస్థంభన చికిత్సకు ఉపయోగించే తడలాపిల్ అధికస్థాయిలో ఉంది. ఇది సాధారణంగా వైద్య పరిరక్షణలో ఇస్తుంటారు. దాని మోతాదు వైద్యులు చెబుతారు.

ఎందుకంటే తడలాఫిల్ ను వైద్య సలహా లేకుండా వినియోగిస్తే గుండెపోటు, స్ట్రోక్, దడ, హార్ట్ రేట్ లో తేడాలు, ప్రియాపిజం వంటి అనర్థాలకు దారితీస్తుంది. అయితే ఇలాంటి మందును కనీసం ఇద్దరు పురుషులు తీసుకున్నారని.. ఒకరు ఆస్పత్రిలో చేరారని.. మరొకరు ప్రియాపిజంకు లోనైనట్లు స్థానిక నివేదికలు వెల్లడించాయి.

ప్రియాపిజం అంటే తీవ్రంగా, బాధాకరమైన సుధీర్గమైన అంగస్తంభన ప్రక్రియ. దీనికి చికిత్స చేయకపోతే నపుంసకత్వానికి దారితీయవచ్చు. అందుకే ఈ ఉత్పత్తులను తీసివేయమని ఆరోగ్య అధికారులు ఆదేశాలిచ్చారు.

అయితే స్థానిక ఈకామర్స్ ఫ్లాట్ ఫారమ్ లో కొందరు దీన్ని విక్రయిస్తున్నారు. ఇది ఉపయోగించి ఆస్పత్రిలో చేరిన వ్యక్తి తన జననేంద్రియాలపై పొక్కులు, వాపు రావడంతో వాపు తగ్గించడానికి యాంటీ బయాటిక్స్ తో కూడిన మందులు వాడుతున్నారు.