Begin typing your search above and press return to search.
బీజేపీ న్యూస్టెప్ : ప్రధమ పౌరురాలిగా ఆదివాసి మహిళ
By: Tupaki Desk | 21 Jun 2022 5:12 PM GMTభారత దేశానికి స్వాతంత్రం వచ్చి ఈ ఏడాది ఆగస్ట్ నాటికి 75 ఏళ్ళు పూర్తి అవుతాయి. ఒక విధంగా రిమార్కబుల్ ఈవెంట్ అది. ఆ వేళకు దేశానికి రాష్ట్రపతిగా ఎవరు ఉంటారు అన్న చర్చ చాన్నాళ్ళుగా సాగుతోంది. దానికి ఈనాటికి జవాబు దొరికింది. ఈ దేశానికి మూలవాసిగా ఆదివాసిగా ఉన్న ఎస్టీలను అత్యున్నత పీఠం మీద కూర్చోబెట్టి బీజేపీ డేరింగ్ అండ్ డేషింగ్ గా
న్యూస్టెప్ తీసుకుంది అని అంటున్నారు.
బీజేపీ విషయానికి వస్తే అగ్రవర్ణాల పార్టీ అన్న ముద్ర ఉంది. దాన్ని ఓబీసీకి చెందిన మోడీ ప్రధాని అయి చాలా వరకూ చెరిపేశారు. ఇక బీజేపీ మోడీ చేతిలోకి వచ్చాక తొలిసారి రాష్ట్రపతిగా దళితుడు అయిన రామ్ నాధ్ కోవింద్ కి చాన్స్ ఇచ్చారు. ఒక ఈసారి ఆదివాసీ మహిళకు అవకాశం ఇచ్చారు. ఆ విధంగా సమాజిక సమన్యాయం తాం చేశామని చెప్పుకోవడానికి ఈ బిగ్ మువ్ ని బీజేపీ చేసింది అంటున్నారు.
ఇక ద్రౌపది ముర్ము అన్న మహిళ బీజేపీకి విధేయురాలు. ఆమె ఎంపిక వెనక చాలా సమీకరణలు ఉన్నాయి. ఆమె ఒడిషా రాష్ట్రానికి చెందిన నాయకురాలు. దాంతో దేశాన ఉన్న తూర్పు ప్రాంతం నుంచి ఈ ఎంపిక చేశారు అని అంటున్నారు. అలాగే ఒడిషాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ పార్టీ బీజేపీకి శత్రుపక్షం కాదు, మిత్రపక్షం అంతకంటే కాదు.
దాంతో ఆ పార్టీ మద్దతు కనుక ఉంటే బీజేపీ అభ్యర్ధి ఎంపిక చాలా సులువు అవుతుంది. దాంతో అక్కడ నుంచే రాష్ట్రపతి అభ్యర్ధిని తెచ్చారు అంటున్నారు. ఇక సామాజికన్యాయం అని అంటున్న వైసీపీ మద్దతు పొందడం ఇంకా సులువు. ఆ పార్టీ కళ్ళుమూసుకుని ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తుంది అని అంటున్నారు.
ఇలా ఈ రెండు పార్టీల మద్దతు ఉంటే కచ్చితంగా బీజేపీ అభ్యర్ధి గెలుపు డెడ్ ఈజీ అవుతుంది. ఈ లెక్కలతో పాటు ఒడిషా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల బలపడేందుకు కూడా బీజేపీ వేసిన ఎత్తుగడగా దీన్ని చూస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీ చాలా తెలివిగా తీసుకున్న నిర్ణయం ఇది అని అంటున్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న నేపధ్యం ఒక వైపు మరో వైపు దేశ స్వాతంత్రానికి 75 ఏళ్ళు పూర్తి అయిన సందర్భం. ఇంకో వైపు రెండేళ్ళలో ఎన్నికలు రాబోతున్న టైమ్ ఇలా అన్నీ ఆలోచిస్తే బీజేపీ ద్రౌపది ముర్ముని సెలెక్ట్ చేయడం గొప్ప ఎత్తుగడ అని చెప్పక తప్పదు.