Begin typing your search above and press return to search.
భాజపాకు స్టార్ క్రికెటర్ల ఝలక్
By: Tupaki Desk | 13 April 2018 7:46 AM GMTకేంద్రంలో అదికారంలో ఉన్నాం కదా.. మనం ఏం అనుకుంటే అది జరిగిపోతుందని ఆశిస్తున్న భారతీయ జనతా పార్టీ పెద్దలకు మరో దక్షిణాది రాష్ట్రంలో ఝలక్ తగిలింది. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్.. అనిల్ కుంబ్లేలను ఎలాగైనా తమ పార్టీలో చేర్చుకోవాలని ఆశించిన భారతీయ జనతా పార్టీ నేతలకు చుక్కెదురైంది. ఎంతగా ఒత్తిడి చేసినా.. ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.
భాజపాలో చేరడానికి కానీ.. ఆ పార్టీ తరఫున తాత్కాలికంగ ప్రచారం చేయడానికి కానీ ద్రవిడ్.. కుంబ్లే అంగీకరించలేదు. క్రికెట్ అంటే యువతకు ఉన్న ఇష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లుగానే కాక వ్యక్తులుగా కూడా మంచి ఇమేజ్ వీళ్లిద్దరినీ ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలని కర్ణాటక భాజపా నాయకులు భావించారు. వాళ్లకు తాయిలాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నించారు. కానీ రాజకీయ రొచ్చులో దిగడానికి ద్రవిడ్.. కుంబ్లే అంగీకరించలేదు. తమిళనాట కూడా రజినీకాంత్ సహా పలువురు హీరోలను బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది భాజపా.
ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి తెలిసిందే. గత ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రివర్స్ అటాక్ చేస్తున్నాడు. కేరళలో భాజపా ఉనికే లేదు. కర్ణాటకలో ఆ పార్టీ బలంగానే ఉంది కానీ.. కేంద్రంలో మోడీ సర్కారుపై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్థానికంగా ప్రభావం చూపుతుందేమో అన్న భయం ఆ పార్టీ నేతల్ని వెంటాడుతోంది. మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.