Begin typing your search above and press return to search.
డీఆర్డోవో మరో ఘనత.. అగ్రదేశాల సరసన భారత్
By: Tupaki Desk | 14 Sep 2020 2:30 PM GMTడీఆర్డీవో (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) సాధించిన ఓ అరుదైన ఘనతతో మనదేశం.. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనా సరసన నిలిచింది. ఇంతకూ డీఆర్డీఏ సాధించిన ఆ ఘనత ఏమిటంటే.. హైపర్సానిక్ టెక్నాలజీని ఇటీవల డీఆర్డీఏ విజయవంతంగా పరీక్షించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలోనే దేశీయంగా అభివృద్ధి చేయనున్నారు. కేవలం అమెరికా, రష్యా, చైనా మాత్రమే చేసే ఈ పరీక్షను డీఆర్డీఏ విజయవంతంగా పూర్తిచేసింది.
ఆయుధాల తయారీలోనూ ముందంజ
ఆయుధాల తయారీలోనూ డీఆర్డీవో దూసుకుపోతోంది. అత్యంత శక్తివంతమైన లేజర్లు, అధికశక్తితో కూడిన మైక్రోవేవ్ వంటి ఆయుధాల తయారు చేసేందుకు కూడా డీఆర్డీవో ప్రణాళికలు రచిస్తోంది. భవిష్యత్లో ఇవి భారత్కు కీలక ఆయుధాలుగా మారనున్నాయి.
శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణులు, యుద్ధవిమానాలను అడ్డొకొనేందుకు ఓ బలమైన ఆయుధాన్ని రూపొందించేందుకు డీఆర్డీయే యత్నిస్తోంది. ‘ కెమికల్ ఆక్సిజన్ అయోడిన్’ ‘ హైపవర్ ఫైబర్’ నుంచి వెలువడే రహస్య లేజర్లతో నడిచే ఓ ఆయుధాన్ని డీఆర్డీఏ తయారు చేయబోతోంది. ఈ ఆయుధం శత్రుదేశాల క్షిపణులను, యుద్ధవిమానాలను తేలికగా అడ్డుకోగలుగుతుందని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రెండు యాంటీ-డ్రోన్ డీఈడబ్ల్యూ వ్యవస్థలను అభివృద్ధి చేసిన డీఆర్డీఓ... ప్రస్తుతం వీటిని భారీగా ఉత్పత్తిచేయాలని యోచిస్తోంది. రెండు కిలోమీటర్ల పరిధిలో వైమానిక లక్ష్యాలను ఛేదించడానికి ఓ ఆయుధాన్ని డీఆర్డీఏ రూపొందించబోతోంది. ఈ ఆయుధం 10 కిలోవాట్ల లేజర్ సామర్థ్యంతో పనిచేస్తుందని.. ట్రైలర్ మౌంటెడ్ డ్రోన్, కిలోమీటరు పరిధిలోని శత్రువుల లక్ష్యాలను చేరుకునే రెండు కిలోవాట్ల లేజర్ కాంపాక్ట్ ట్రైపాడ్-మౌంటెడ్‌ను రూపొందించినట్టు డీఆర్డీఏ పేర్కొంది.