Begin typing your search above and press return to search.
శౌర్య క్షిపణి ప్రయోగం సక్సెస్.. ప్రత్యేకత ఏమిటంటే ?
By: Tupaki Desk | 3 Oct 2020 5:41 PM GMTభారత్, చైనా సరిహద్దులో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత రక్షణ రంగంలో ప్రయోగాలు జోరందుకున్నాయి. రెండు రోజుల క్రితం ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ ని విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీఓ శనివారం మరో ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. ఒడిశాలోని బాలాసోర్ నుంచి శనివారం జరిపిన శౌర్య క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. శౌర్య క్షిపణి భూతలం నుంచి భూతలంపై 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
ఐతే, శౌర్య క్షిపణిని గతంలోనే రూపొందించగా.. తాజాగా మరింత ఆధునీకరించారు. కొత్త వెర్షన్‌ను ప్రయోగించి పరీక్షించారు. ఆధునీకరించిన ఈ శౌర్య మిసైల్‌ని త్వరలోనే భారత అమ్ముల పొదిలోకి చేరుస్తామని ప్రకటించారు. అత్యంత తేలికైన క్షిపణిగా పేరున్న శౌర్యను ప్రయోగించడం కూడా తేలిక అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యూహాత్మక క్షిపణుల తయారీలో పూర్తి స్వయం స్వావలంబన సాధించే దిశగా ప్రయోగాలు డీఆర్డీఓ శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని డీఆర్‌డీవో బుధవారం విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. ఒడిశాలోని చాందీపూర్ రేంజ్ నుంచి ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను విజయవంతంగా చేధించగలదు.