Begin typing your search above and press return to search.

రామ్‌ దేవ్ బాబాతో డీఆర్‌ డీఏ

By:  Tupaki Desk   |   24 Aug 2015 10:32 AM GMT
రామ్‌ దేవ్ బాబాతో డీఆర్‌ డీఏ
X
ప్ర‌ముఖ యోగ‌ గురువు బాబా రామ్‌దేవ్ బాబాతో డీఆర్‌ డీఏ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డ‌వ‌ల‌ప్ మెంట్ ఆర్గ‌నైజేష‌న్‌) టై అప్ అయ్యింది. డీఆర్‌ డీఏ సంస్థ ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త సైన్యం కోసం అత్య‌త్తమ నాణ్య‌త‌తో కూడిన ఆహార ప‌దార్థాలు, ఇర‌త‌ ఐట‌మ్స్‌ ను ఉత్ప‌త్తి చేసేది. దేశ‌ ర‌క్ష‌ణ కోసం స‌రిహ‌ద్దులో ఉండే సైన్యం కోసం త‌యారు చేసే ఐటెమ్స్ కావ‌డంతో నాణ్య‌త విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డే ప్ర‌శ‌క్తే ఉండదు.

అయితే త‌మ ఉత్ప‌త్తుల‌ను మ‌రింత మంది విన‌యోగ‌దారుల‌కు చేర్చాల‌ని..త‌మ ప్రొడ‌క్స్ట్‌ మార్కెట్ పెంచుకోవాల‌న్న సంక‌ల్పంతో ఉన్న డీఆర్‌ డీఏ యోగ‌గురువు రాందేవ్ బాబాకు చెందిన ప‌తంజ‌లి ఆయుర్వేదిక్ అండ్ హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ సంస్థ‌తో చేతులు క‌ల‌ప‌నుంది. ఇక‌పై డీఆర్‌ డీఏ ద్వారా త‌యార‌య్యే ఆహార ప‌దార్థాలు, ఇత‌ర ఉత్ప‌త్తులు ఈ సంస్థ ద్వారా మార్కెట్ లోకి వ‌స్తాయి.

అయితే నాణ్య‌త విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌ని డీఆర్‌ డీఏ వీటిని అత్యుత్త‌మ స్థాయి ల్యాబ్‌ ల్లో ప‌రిశోధించాకే మార్కెట్ లోకి రిలీజ్ చేసేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.